ETV Bharat / bharat

ఏసీబీ దాడుల్లో పట్టుబడిన రూ.42 లక్షలు.. ఆ అధికారివేనా?

author img

By

Published : Jun 17, 2022, 11:07 AM IST

Updated : Jun 17, 2022, 1:43 PM IST

acb raid bangalore
ఓ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు

ACB Raids: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది అధికారులకు చెందిన 80 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టింది అవినీతి నిర్మూలన శాఖ(ఏసీబీ). ఈ దాడుల్లో కర్ణాటక, బాగల్​కోట్​ ఆర్​టీఓ అధికారి బంధువు ఇంట్లో రూ.42 లక్షల నగదు పట్టుబడినట్లు తెలిపింది.

ACB Raids: అవినీతి ఆరోపణలతో కర్ణాటకలోని పలువురు ప్రభుత్వ అధికారుల నివాసాలపై శుక్రవారం ఉదయం దాడులు నిర్వహించింది అవినీతి నిర్మూలన విభాగం(ఏసీబీ). తనిఖీల్లో భాగంగా బాగల్​కోట్​ ఆర్​టీఓ అధికారి బంధువు ఇంట్లో రూ.42 లక్షల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. నగదుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు.

acb raid bangalore
ఓ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు

పలువురు అధికారులకు శుక్రవారం తెల్లవారుజామునే దాడులు చేపట్టి షాక్​ ఇచ్చింది ఏసీబీ. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది అధికారులకు చెందిన 80 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచే వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఉన్న ఆస్తుల వివరాలు, పత్రాల ధ్రువీకరణ చేపట్టినట్లు చెప్పారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జిల్లాల్లో ఈ దాడులు చేపట్టామన్నారు. అధికారుల్లో ఆర్​టీఓ, సీఐ, పీడబ్ల్యూడీ ఇంజినీర్లు, రిజిస్ట్రేషన్​ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

acb raid bangalore
తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు

ఇదీ చూడండి: ఆరు రోజుల్లో 1400 వెబ్​సైట్లు హ్యాకింగ్​.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

మేనకోడలిపై బిజినెస్​మ్యాన్​ అత్యాచారం.. దావూద్​ గ్యాంగ్‌తో చంపిస్తానంటూ..

Last Updated :Jun 17, 2022, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.