ETV Bharat / bharat

77th Independence Day 2023 : ఏ శక్తికీ భారత్ భయపడదు.. తలవంచదు : ప్రధాని మోదీ

author img

By

Published : Aug 15, 2023, 6:38 AM IST

Updated : Aug 15, 2023, 10:51 AM IST

77th independence day 2023
77th independence day 2023

09:10 August 15

  • స్వతంత్ర సమరంలో నాటి యోధులు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు
  • దేశం కోసం త్యాగం నాటి లక్షణం.. అవసరం
  • దేశం కోసం జీవించడం నేటి అవసరం
  • ప్రపంచంతో కలబడి నిలబడాల్సిన సమయమిది

09:05 August 15

  • నేను మీ మధ్య నుంచే వచ్చినవాణ్నే.. మీ గురించే ఆలోచిస్తాను
  • మీరంతా నా కుటుంబం... నేను మీ కుటుంబంలో ఒకడిని
  • నా స్వప్నం మీ కోసం.. నా పరిశ్రమ మీ కోసం
  • మనందరి స్వప్నాలను సాకారం చేసే దిశగా నా ప్రయత్నం ఉంటుంది
  • స్వప్నాల సాధనలో మీ సహకారం ఆశిస్తున్నా
  • మన పరిశ్రమకు స్వాతంత్య్ర సమరయోధుల ఆశీర్వాదం ఉంది
  • నడుస్తున్న కాలం మనది.. అమృతకాలమిది
  • ఈ కాలం భారత యువతదే
  • సవాళ్లెన్నో యువత ముందున్నాయి.. పరిష్కారం బాధ్యత యువతదే
  • సవాళ్లను ఎదుర్కొందాం.. ప్రపంచంలో అగ్రగామిగా నిలుద్దాం

08:56 August 15

  • వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి కొత్త అర్థానిచ్చాయి
  • కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబానికే మేలు అన్నట్లుగా తయారయ్యాయి
  • కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమే తప్ప లాభముండదు
  • 2047లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఆవిష్కృతం కావాలంటే అవినీతికి స్వస్తి చెప్పాలి
  • కొత్త తరానికి నూతన భారతాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
  • స్వతంత్ర సమరయోధుల కలలు సాకారం దిశగా మన అడుగులు పడాలి
  • జీవితాలను త్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది

08:53 August 15

  • మూడు ప్రధాన సమస్యలు భారత్‌ను పట్టిపీడిస్తున్నాయి
  • అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను నిర్మూలించాలి
  • మూడు ప్రధాన సమస్యలను నిర్మూలిస్తేనే మన అభివృద్ధి నిరాఘాటంగా సాగుతుంది
  • అవినీతి చెదలను సమూలంగా తుదముట్టించాలి
  • అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలి
  • వారసత్వ రాజకీయాలను స్వస్తి పలకాలి
  • బుజ్జగింపు రాజకీయాలను మానుకోవాలి
  • సాంకేతిక అభివృద్ధి సాయంతో అవినీతిని అరికట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది
  • పారదర్శక విధానాలతో అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు సాగుతున్నాయి
  • పది కోట్లమంది పేరుతో సాగుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేశాం
  • లబ్ధిదారులే లేకుండా పది కోట్లమందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి
  • సాంకేతిక పరిజ్ఞానంతో పది కోట్లమంది బినామీలను తొలగించాం
  • వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపు ఈ దేశానికి కోలుకోలేని నష్టం మిగిల్చాయి
  • అవినీతి, వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి

08:49 August 15

  • 2047 భారత స్వతంత్ర శతజయంతి నాటికి అభివృద్ధి చెందిన భారతం ఆవిష్కృతం కావాలి
  • యావజ్జాతి సంపూర్ణ సంకల్పంతోనే ఇది సాధ్యమవుతుంది
  • 75 ఏళ్లలో మనం గొప్ప అభివృద్ధిని సాధించాం.. ఇది ద్విగుణీకృతం కావాలి
  • 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సంకల్పం తీసుకోవాలి
  • సమస్యలు ఉంటాయి.. పరిష్కారాలు వెతగడమే మన బాధ్యత
  • కలలు నిజం కావాలంటే దృఢసంకల్పంతో పనిచేయాలి

08:42 August 15

  • భారత్‌ స్వయం సమృద్ధి సాధించడంతోపాటు ప్రపంచాభివృద్ధికి తన వంతు భూమిక పోషిస్తోంది
  • భారత్‌ విశ్వమిత్ర రూపంలో ప్రతి దేశానికి మిత్రదేశంగా ఉండాలనుకుంటోంది
  • ప్రపంచంలోని ప్రతి దేశం భారత్‌ మిత్రుడే
  • భారత్‌ లోకకల్యాణం కోసం పనిచేస్తోంది
  • ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే ప్రపంచమన్నది భారత విధానం
  • ఒకే భూమి సర్వమానవాళి సంక్షేమ లక్ష్యంగానే భారత్‌ విధానాలు ఉంటాయి

08:38 August 15

  • భారత మహిళలు నూతన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు
  • శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురుషులను అధిగమించి మహిళలు ముందడుగు వేస్తున్నారు
  • భారత స్వయంసహాయక సంఘాలు జాతి ప్రగతిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు
  • భారత స్వయంసహాయక సంఘాలకు డ్రోన్లను సమకూర్చి వ్యవసాయరంగంలో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాం
  • మౌలిక సదుపాయాల రంగంలో భారత్‌ నూతన లక్ష్యాలను చేరుకుంటోంది
  • భూతల, జల రవాణాల్లో భారీ లక్ష్యాలను చేరుకుంటున్నాం
  • సమయానికన్నా ముందుగానే అంతర్గత జలరవాణా మార్గాల నిర్మాణం పూర్తవుతోంది
  • నూతన రైల్వే వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయి

08:30 August 15

  • ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు
  • సమూన్నత లక్ష్యాలతో భారత్‌ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోంది
  • మన సైన్యం సమర్థత, సన్నద్ధతపై ఒక విషయం చెప్పాలనుకుంటున్నా
  • దేశ సరిహద్దులను పరిరక్షించడమే కాదు.. ఏ యుద్ధానికైనా మన సైన్యం సర్వం సన్నద్ధంగా ఉంది
  • గత కాలపు ఆలోచనలకు ముగింపు పలికి కొత్త చేతనతో సైన్యం ముందడుగు వేస్తోంది
  • దేశం వేస్తున్న ప్రతి ముందడుగు మనందరి బలం, బాధ్యత
  • వైవిధ్యంలో ఉన్న ఏకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కొత్త అడుగులు పడుతున్నాయి
  • నా మాటల్లోని కొత్త భాష, కొత్త ఆలోచనలు భారత్‌ను మరింత బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నా
  • భారత ఉత్పత్తులు, సేవలు ప్రపంచ ప్రమాణాలకు దీటుగా నిలబడతాయి
  • సమస్యలను అధిగమించి నిలబడ్డ దేశాలే ప్రపంచంలో అగ్రభాగాన నిలబడ్డాయి
  • సమస్యల పరిష్కారంపై దృష్టి ఉండాలిగానీ.. సమస్యలను ఎత్తిచూపడంలో కాదు
  • భారత మహిళా శక్తి పట్ల ప్రపంచం చూస్తోంది
  • ప్రపంచంలో అత్యధిక మహిళా పైలెట్లు, శాస్త్రవేత్తలు భారత్‌లోనే ఉన్నారు
  • ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించింది
  • భారత మహిళా స్వయంసహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి

08:27 August 15

  • మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నాం
  • బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం
  • పట్టణ ప్రాంతాల్లో నివసించే దిగువ, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకం
  • లక్షల రూపాయల ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాం
  • ధరల పెరుగుదలతో ప్రజలు పడుతున్న కష్టాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి
  • హైడ్రో ఆధారిత రవాణా వ్యవస్థ నుంచి క్వాంటమ్‌ కంప్యూటర్లు, మెట్రో రైళ్ల వ్యవస్థల్లో వేగంగా ముందడుగు వేస్తున్నాం
  • పాత ఆలోచనలు, విధానాలు పక్కనపెట్టి నూతన లక్ష్యాల దిశగా భారత్‌ వేగంగా సాగుతోంది
  • సర్వజనహితంతో సుదూర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త దారులు నిర్మిస్తున్నాం
  • దేశవ్యాప్తంగా అమృత్‌ సరోవర్‌లో భాగంగా 75వేల జలవనరులను అభివృద్ధి చేస్తున్నాం
  • జలశక్తి, జనశక్తి ఏకమై పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేస్తున్నాం
  • నూతన ఇంధన వనరులను దేశ ముందుకు తీసుకొస్తున్నాం
  • సౌరశక్తి, పవనశక్తిని సద్వినియోగం చేస్తూ చౌకధరలో విద్యుదుత్పత్తి చేస్తున్నాం
  • ఇథనాల్‌ ఉత్పత్తిలో ముందడుగు వేసి పెట్రో దిగుమతుల భారం మరింత తగ్గిస్తున్నాం
  • ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు
  • సమూన్నత లక్ష్యాలతో భారత్‌ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోంది

08:17 August 15

  • పశు, మత్స్య సంపద అభివృద్ధికి నూతన బాటలు తెరిచాయి
  • సహకార రంగం బలోపేతానికి సహకార మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేశాం
  • పరస్పర సహకారంలోనే జాతి మనుగడ ఇమిడి ఉందని భావించే సహకార శాఖ ఏర్పడింది
  • 2014లో మేము వచ్చేనాటికి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయి
  • అనేక సమస్యలు చుట్టుముట్టి ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉంది
  • బలమైన ఆర్థిక విధానాలు, పారదర్శక పాలన దేశానికి కొత్త శక్తినిచ్చాయి
  • పథకాల్లో ఉన్న అనేక అవకతవకలను కట్టడిచేశాం
  • పథకాల్లోని లోపాలను అరికట్టాం
  • చిన్న లోపాలు అరికట్టడం వల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరింది
  • వ్యవసాయ రంగంలో తెచ్చిన అనేక సంస్కరణలు రైతులకు లబ్ధిని చేకూర్చింది
  • యూరియాపై రూ.10 లక్షల కోట్లు రాయితీ రైతులకు లభిస్తోంది
  • ముద్ర యోజన ఎంఎస్‌ఎంఈలను మరింత బలోపేతం చేసింది
  • ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేయడం కొత్త ఉద్యోగాలను సృష్టించింది
  • నిరంతరం జరుగుతున్న అభివృద్ధి నవీన మధ్యతరగతిని సృష్టించింది
  • విశ్వకర్మ జయంతి సందర్భంగా వచ్చే నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభిస్తున్నాం
  • చేతివృత్తుల వారికి నైపుణ్యాభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లతో కొత్త నిధిని ఏర్పాటుచేస్తున్నాం
  • దేశవ్యాప్తంగా ఉన్న చేతివృత్తుల మరింత బలోపేతానికి నైపుణ్యాభివృద్ధి ఉపయోగపడుతుంది
  • జన ఔషది దుకాణాలు మధ్యతరగతి, పేదలపైనా ఔషధ భారాన్ని తగ్గించాయి
  • మార్కెట్‌లో రూ.100కు దొరికే మందులు రూ.10-15లకు జన ఔషధి దుకాణాల్లో లభిస్తున్నాయి
  • 15 వేల జన ఔషధి దుకాణాలు నూతనంగా ఏర్పాటవుతున్నాయి
  • అతి సమీప భవిష్యత్తులో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది
  • భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందన్నది మోదీ గ్యారంటీ ఇస్తున్నారు

08:06 August 15

  • భారత్‌లో జరిగిన జీ20 సమావేశాలు భారత సామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచం ముందుంచాయి
  • జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయి
  • మన ఎగుమతులు కొత్త లక్ష్యాలను చేరుకుంటున్నాయి
  • కరోనా తర్వాత భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది
  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం ఆవిష్కారమవుతుంది
  • మారుతున్న ప్రపంచంలో భారత్‌ను తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది
  • కరోనా కాలంలో మన ఉత్పత్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసివచ్చాయి
  • మానవ జాతి వికాసానికి అనుగుణంగానే భారత్‌ పనిచేస్తుందన్న విషయం ప్రపంచానికి తెలిసింది
  • మానవాళి పట్ల భారత్‌కు ఉన్న గౌరవ మర్యాదలు కరోనా ప్రపంచానికి పరిచయం చేసింది
  • భారత్‌ పట్ల చిన్నచూపు చూసే ప్రపంచానికి మన సామర్థ్యాలు ఏంటో తెలిసివచ్చాయి
  • కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు
  • భారత సంస్కృతి, సంప్రదాయాల విలువలు ప్రపంచం మరోసారి చూసింది
  • మన జాతిలో నిక్షిప్తమై ఉన్న నీరక్షీర న్యాయం, వివేకం మన జాతి బృహత్‌ లక్షణాలు
  • దేశమే ప్రథమమన్న పురోగామి ఆలోచనలతో జాతి నవోత్సాహంతో ముందడుగు వేస్తోంది
  • బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమవుతాయి
  • ప్రతి సంస్కరణ జాతి జనక్షేమాన్ని కాంక్షించే జరుగుతున్నాయి
  • ఫర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌ అన్న పద్ధతిలో నవీన భారతం ముందడుగు వేస్తోంది
  • ప్రతి సంస్కరణలోనూ ఒక పరమార్థం ఉంది
  • జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక ఉదాహరణ
  • ప్రతి ఇంటికి శుద్ధ తాగునీరు, పర్యావరణ పరిరక్షణ సమేతంగా సాగుతోంది

07:59 August 15

  • వ్యవసాయరంగంలో మన రైతుల కృషి సాటిలేనిది
  • ప్రపంచానికే ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి మన రైతులు ఎదిగారు
  • భారతీయ శ్రామికవర్గం చెమటోడ్చి జాతి సంపదను పెంచడంలో నిమగ్నమైంది
  • చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కొత్త దశాదిశను నిర్దేశిస్తున్నాయి
  • భవిష్యత్తుపై భారతీయుల్లో విశ్వాసం పెరిగింది
  • భారత్‌ పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగింది
  • ప్రపంచం మనవైపు చూస్తోందంటే అది సంపూర్ణ భారత జాతి కృషి ఫలితం
  • భారత్‌ కొత్త సామర్థ్యాలను పునికిపుచ్చుకొని ప్రపంచంలో తనదైన స్థానం నిలుపుకుంటోంది

07:55 August 15

  • అభివృద్ధి అన్నది మహానగరాలకే కాదు.. చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది
  • సాంకేతికతలో చిన్న పట్టణాల నుంచి వచ్చే యువత కొత్త మెరుపులు మెరిపిస్తోంది
  • చిన్న పట్టణాల నుంచి వచ్చే యువత కొత్త సాంకేతికతను సృష్టిస్తోంది
  • అతి పేద వర్గాల నుంచి వచ్చిన ఎంతోమంది క్రీడారంగంలో సమోన్నత స్థానాలను కైవసం చేసుకుంటోంది
  • మన యువత సొంత ఉపగ్రహాలను తయారుచేసి కక్ష్యలోకి పెడుతోంది
  • ఆకాశమే హద్దులుగా మన యువత అనేక రంగాల్లో సామర్థ్యాలను నిరూపించుకుంటోంది

07:54 August 15

  • వెయ్యేళ్ల భవిష్యత్తు సంధికాలంలో మనం నిలబడి ఉన్నాం
  • వెయ్యేళ్ల భవిష్యత్తును కాంక్షించి మన కృషి, పట్టుదలతో ముందుకెళ్లాలి
  • మన యువశక్తిలో సామర్థ్యం ఉంది
  • యువతను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది
  • ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌ సిస్టమ్‌గా భారత్‌ను మన యువత నిలబెట్టింది
  • సాంకేతికత ప్రపంచ గతిని మార్చేస్తోంది
  • ప్రపంచ సాంకేతిక ఆధునికతలో భారత్‌కు ప్రధాన భూమిక ఉంది
  • భారత యువత సాంకేతికత అజెండాను సగర్వంగా ప్రపంచం ముందు ఉంచుతోంది

07:50 August 15

  • స్వతంత్ర అమృతకాలంలో నూతనోత్తేజంతో దేశం ముందడుగు వేస్తోంది
  • వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారత్‌ స్వాతంత్ర్యం పొందింది
  • స్వాతంత్య్రం అనంతరం ఇప్పుడు కొత్త వెలుగులవైపు భారత్‌ పయనిస్తోంది
  • అమృతకాలంలో నవయవ్వన భారతం ఆవిష్కృతమవుతోంది
  • ప్రజాస్వామ్యం, జనాభా, వివిధతల త్రివేణి సంగమం భారత్‌ను స్వర్ణయుగంలోకి నడిపిస్తోంది

07:41 August 15

జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం

  • స్వాతంత్ర సమరంలో అశువులు బాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు
  • స్వతంత్ర సంగ్రామంలో జీవితాలను పణంగా పెట్టిన త్యాగధనులకు నివాళులర్పిస్తున్నాను
  • ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ శతజయంతి జరుపుకుంటున్నాం
  • రాణి దుర్గావతిని, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన సంవత్సరమిది
  • కొద్ది వారాల క్రితం ముఖ్యంగా మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమైంది
  • మణిపుర్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలు గర్హించదగినవి
  • కొద్దిరోజులుగా మణిపుర్‌లో శాంతి నెలకొంటున్న సూచనలందుతున్నాయి

07:30 August 15

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని

  • దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
  • ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని
  • ప్రధానిగా మోదీ వరుసగా పదోసారి ఎర్రకోటపై పతాకావిష్కరణ
  • ఎర్రకోట వేడుకలకు విశిష్ట అతిథులను ఆహ్వానించిన కేంద్రం
  • వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్రం ఆహ్వానం
  • ఎర్రకోట బయట, లోపల అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
  • జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్రమోదీ

07:08 August 15

రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని మోదీ

దిల్లీ: రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని మోదీ

06:17 August 15

77th Independence Day 2023 : పంద్రాగస్టు వేడుకలకు రంగం సిద్ధం.. ఎర్రకోటపై పదోసారి జెండా ఎగురవేయనున్న మోదీ

77th Independence Day 2023 : దిల్లీలో ఎర్రకోటపై స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధంకాగా ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలుస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు.. చివరిసారిగా చేస్తున్న ప్రసంగంలో మోదీ తన ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగుస్తాయి.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న భావన ప్రకారం దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల వారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన లబ్ధిదారులు, సెంట్రల్‌ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్‌ జల్‌ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాలకు ఆటంకం కల్గించే రీతిలో దిల్లీ లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు నిఘా వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. సైనిక స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులకు తెగబడేందుకు పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ కుట్రలు పన్నారనే సమాచారంతో దేశ సరిహద్దుల్లోనే కాకుండా దిల్లీలో భద్రతాదళాలు అప్రమత్తం అయ్యాయి. దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ముఖ గుర్తింపు కెమెరాలు వెయ్యి అమర్చారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. ఈసారి ఇంటర్‌నెట్‌ సేవలపై, ఆంక్షలు మాత్రం ఉండవని స్పష్టం చేశారు.

Last Updated : Aug 15, 2023, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.