ETV Bharat / bharat

80 అడుగుల బావిలో దిగాక కరెంట్​ షాక్.. అన్నదమ్ములతోపాటు మరొకరు అక్కడికక్కడే..

author img

By

Published : Dec 22, 2022, 11:05 AM IST

80 అడుగుల బావిలో బోర్​ వేసేందుకు దిగిన ముగ్గురు వ్యక్తులు కరెంట్​ షాక్​ గురై మృతి చెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో జరిగింది. అసలు ఏమైందంటే?

3 including 2 brothers died due to electrocution in 80 feet deep well in rajasthan
3 including 2 brothers died due to electrocution in 80 feet deep well in rajasthan

రాజస్థాన్​లోని భిల్వారా జిల్లాలో విషాదం నెలకొంది. 80 అడుగుల లోతైన బావిలో బోరు వేసేందుకు దిగిన ముగ్గురు వ్యక్తులు కరెంట్​ షాక్​కు గురై మరణించారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని రాయల పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. జోధాదస్​ గ్రామానికి చెందిన ధన్నా గుర్జర్.. తన ​పొలంలో ఉన్న బావిలో బోరు వేయాలనుకున్నాడు. అందుకోసం బోర్​ వేసే వాళ్లను బుధవారం రప్పించాడు. పని మొదలుపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగారు. అనంతరం బోర్ వేయడానికి విద్యుత్​ మీటర్ సిద్ధం చేశారు. దురదృష్టవశాత్తు నీటిలోకి విద్యుత్​ ప్రవహించింది. దీంతో బావిలో ఉన్న ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

3 including 2 brothers died due to electrocution in 80 feet deep well in rajasthan
80 అడుగుల బావి

సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం-ఎస్​డీఆర్​ఎఫ్​ బృందం కూడా చేరుకుంది. సుమారు మూడుగంటలకు పైగా శ్రమించి బావిలోని ముగ్గురు మృతదేహాలను ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు సోదరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

3 including 2 brothers died due to electrocution in 80 feet deep well in rajasthan
సహాయక చర్యల దృశ్యాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.