ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ వరదల్లో 8 మంది మృతి

author img

By

Published : Apr 24, 2021, 10:30 AM IST

Updated : Apr 24, 2021, 11:33 AM IST

ఉత్తరాఖండ్​ను మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకొని 8 మంది మరణించారు. మరో 384 మంది కార్మికులను భారత సైన్యం రక్షించింది.

avalanche
ఉత్తరాఖండ్‌లో వరదలు

ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలకు 8 మంది మరణించగా.. అనేకమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో 5 రోజులుగా వర్షం, మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. సుమ్నా-రిమ్‌ఖిమ్‌ రహదారిపై వరదల్లో చిక్కుకున్న 384 మంది కార్మికులను బీఆర్‌ఓ సిబ్బంది కాపాడారు. వారిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది.

కార్మికులు జోషీమఠ్‌-మలారీ మధ్య రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. రహదారి నిర్మాణ పనుల కోసం రెండు శిబిరాల్లో కార్మికులు ఉండగా.. ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. రెండు శిబిరాల్లోని కార్మికులను గుర్తించే పనిలో భారత సైన్యం ఉంది. ఘటనాస్థలిలో సైన్యం సహాయ చర్యలు చేపట్టింది.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్‌: కలవరపెడుతోన్న 'డేంజర్‌ లేక్‌'!

Last Updated : Apr 24, 2021, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.