ETV Bharat / bharat

'పిడుగుపాటుకు 20 మంది మృతి.. 22 జిల్లాలపై ప్రభావం'

author img

By

Published : Apr 18, 2022, 10:20 AM IST

Assam Lightning Strike
పిడుగుపాటు

Assam Lightning Strike: అసోంలో పిడుగుపాటు, తుపాను కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలో 19మంది మృతిచెందగా.. మార్చి నెలాఖరున ఒకరు పిడుగుపాటుకు బలయ్యారు. 22 జిల్లాల్లో 1,333 హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Assam Lightning Strike: పిడుగుపాటు, తుపానుల కారణంగా అసోంలో భారీ ప్రాణనష్టం జరిగింది. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటివరకు 20మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత మూడు రోజుల్లో పిడుగుపాటు, తుపానుల వల్ల 22 జిల్లాలోని 1,410 గ్రామాలు ప్రభావితమయ్యాయని.. 95,239 మందిపై ఈ తుపాను ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు త్వరలోనే నష్టపరిహారాన్ని అందించనున్నట్లు తెలిపారు.

ఈ ఘటనల్లో 3,011 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 19,256 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 1333 హెక్టార్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. పిడుగుపాటుకు గురైన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై మరోసారి సమగ్రంగా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: గుజరాత్​లో మోదీ మూడు రోజుల పర్యటన.. డబ్లూహెచ్​ఓ కేంద్రం గర్వకారణమని ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.