ETV Bharat / bharat

రెండున్నరేళ్ల చిన్నారికి 'సూపర్​ మెమొరీ'.. ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

author img

By

Published : Jan 3, 2023, 3:36 PM IST

2-year-girl-enters-international-book-of-records-and-indian-book-of-records-from-west-bengal
పశ్చిమ బంగాల్ చిన్నారి అధిష్ఠాత్రి బిశ్వాస్

బంగాల్ చెందిన ఓ చిన్నారి తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకోంటుంది. నిమిషాల వ్యవధిలోనే వివిధ రకాల పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, వాటి శాస్త్రీయ నామాలు చెప్పేస్తోంది. తన అద్భుత జ్ఞాపక శక్తితో ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్, ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది ఈ రెండున్నరేళ్ల చిన్నారి.

రెండున్నరేళ్ల చిన్నారి అద్భుత ప్రతిభ.. ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు

ఇంకా బడిలోకే అడుగుపెట్టని ఆ చిన్నారి.. అప్పుడే ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.. అద్భుతమైన జ్ఞాపకశక్తితో అదరగొడుతోంది. కేవలం రెండున్నరేళ్ల వయస్సున్న చిన్నారి.. తన అసమాన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే వివిధ రకాల పక్షులు, జంతువుల పేర్లు.. వాటి శాస్త్రీయ నామాలను అలవోకగా చెప్పేస్తోంది. అతి కష్టమైన ఆంగ్ల పదాలను క్యూట్​క్యూట్​గా అప్పచెబుతోంది. ఆ చిన్నారే బంగాల్​కు చెందిన అధిష్ఠాత్రి బిశ్వాస్. A నుంచి Z వరకు ప్రతి ఆంగ్ల అక్షరానికి ఒక్కో ఆటోమొబైల్ సంస్థ పేరును చెప్పి ప్రపంచ రికార్డు కైవసం చేసుకుంది అధిష్ఠాత్రి.

2 year girl enters International Book of Records and indian Book of Records from west bengal
మెడల్స్​తో చిన్నారి అధిష్ఠాత్రి బిశ్వాస్

అధిష్ఠాత్రి తండ్రి అభిజిత్​ బిశ్వాస్.. ఓ ప్రొఫెసర్.​ తల్లి రాజ్​ కుమారి హోమ్ టీచర్. వీరంతా హూగ్లీ జిల్లా, చిన్సురాలోని దత్తా బగన్​లో నివాసం ఉంటున్నారు. చిన్న వయస్సులోనే అద్భుతమైన జ్ఞాపక శక్తిని అలవరుచుకున్న చిన్నారి.. వివిధ రకాల కార్ల సంస్థల పేర్లను A నుంచి Z​ వరకు చెప్పేస్తోంది. 100 వరకు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలను ఇస్తోంది. తనకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే.. ఇండియన్​ బుక్స్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది చిన్నారి.

మా చిన్నారికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వాటన్నింటిని రికార్డు చేసి, ఆ వీడియోను ఇంటర్నేషనల్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఇండియన్​ బుక్స్​ ఆఫ్​ రికార్డ్స్​ సంస్థలకు పంపాను. దాంతో అధిష్ఠాత్రి బిశ్వాస్ ప్రతిభను గుర్తించిన సదరు సంస్థలు.. ఆమెకు ఈ అవార్డులను ప్రకటించాయి.
-చిన్నారి తల్లి, రాజ్​ కుమారి

2 year girl enters International Book of Records and indian Book of Records from west bengal
తల్లితో చిన్నారి అధిష్ఠాత్రి బిశ్వాస్

"మేము ఆటల ద్వారానే ఆమెకు అన్నీ నేర్పించేందుకు ప్రయత్నిస్తాము. వివిధ రకాల విషయాల గురించి చిన్నారికి చెబుతాము. దీంతో ఆమెలో కంఠస్థం ధోరణి పెరుగుతుంది. ఆమె సాధించిన ఘనతల పట్ల మేమందరం చాలా గర్విస్తున్నాం." అని చిన్నారి తల్లి తెలిపారు.

2 year girl enters International Book of Records and indian Book of Records from west bengal
రికార్డ్​ పత్రాలు
2 year girl enters International Book of Records and indian Book of Records from west bengal
మెడల్స్​తో చిన్నారి అధిష్ఠాత్రి బిశ్వాస్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.