ETV Bharat / bharat

టూల్​కిట్​ వివాదం: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు

author img

By

Published : May 25, 2021, 3:56 PM IST

కొవిడ్​ టూల్​కిట్​కు సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు దిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతలు సహకరిస్తే దర్యాప్తు వేగంగా పూర్తి చేయొచ్చని తెలిపారు. మరోవైపు.. 11 మంది భాజపా నేతలు, కేంద్ర మంత్రులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రణ్​దీప్ సుర్జేవాలా కోరారు. ఈమేరకు ట్విట్టర్​కు లేఖ రాశారు.

congress leaders
టూల్ కిట్, కాంగ్రెస్ టూల్​కిట్

కొవిడ్ టూల్​కిట్ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు దిల్లీ పోలీసులు. కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా, కాంగ్రెస్ ప్రతినిధి ఎంవీ రాజీవ్ గౌడను దర్యాప్తునకు సహకరించాలని కోరినట్లు సీనియర్ పోలీసు అధికారి స్పష్టం చేశారు.

అయితే.. ఇవి కొత్తగా ఇస్తున్న నోటీసులు కాదని 8-9 రోజుల క్రితమే ఇచ్చినట్లు అధికారి పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతలు సహకరిస్తే దర్యాప్తు వేగంగా పూర్తి చేయొచ్చని తెలిపారు.

కొవిడ్ టూల్​కిట్ విషయంపై దర్యాప్తులో భాగంగా.. సోమవారం ట్విట్టర్​కు నోటీసులు ఇచ్చింది దిల్లీ పోలీసు స్పెషల్ సెల్. భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా ట్వీట్​ను 'మ్యానిపులేటెడ్ మీడియా' అని ఏ విధంగా పరిగణించిందో వివరించాలని కోరింది. అనంతరం.. దిల్లీ లాడోసరాయ్, గురుగ్రామ్​లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

11 మంది మంత్రులపై చర్యలు?

కొవిడ్​పై రాజకీయ వివాదానికి తెరలేపిన 'టూల్​కిట్​' వ్యవహారంపై ఆగ్రహించిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణ్​దీప్ సుర్జేవాలా​.. ట్విట్టర్​కు లేఖ రాశారు. పార్టీకి సంబంధించి తప్పుడు సమాచారం అందించేలా ట్వీట్లు ఉన్నాయని ఆరోపిస్తూ.. 11 మంది కేంద్ర మంత్రుల ట్వీట్​లకు 'మ్యానిపులేటివ్ మీడియా' ట్యాగ్​ జోడించాలని కోరారు. ఫోర్జరీకి పాల్పడిన మంత్రులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్​ టూల్​కిట్​గా వెలుగులోకి వచ్చిన డాక్యుమెంట్లను ట్విట్టర్ మ్యానిపులేటివ్ మీడియాగా పేర్కొన్నట్లు గుర్తుచేశారు. గిరిరాజ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీ, ధర్మేంద్ర ప్రధాన్, రమేశ్ పోఖ్రియాల్, థావర్​చం​ద్ గహ్లోత్, హర్షవర్ధన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, గజేంద్ర సింగ్ షెకావత్​లపై చర్యలు తీసుకోవాలని సుర్జేవాలా కోరారు.

ఇదీ చదవండి:టూల్​కిట్ వివాదం- ట్విట్టర్​కు కేంద్రం వార్నింగ్!

నిజం దేనికీ భయపడదు: రాహుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.