ETV Bharat / bharat

ఇన్​స్టా​లో స్నేహం.. డ్రగ్స్​ ఇచ్చి సామూహిక అత్యాచారం

author img

By

Published : Feb 24, 2021, 4:46 PM IST

ఇన్​స్టాగ్రామ్​ ద్వారా స్నేహం చేసి 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు ఏడుగురు వ్యక్తులు. కేరళ మలప్పురం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

sexual assault
డ్రగ్స్​ ఇచ్చి సామూహిక అత్యాచారం

ఇన్​స్టాగ్రామ్​ స్నేహం బాలిక పాలిట శాపంగా మారింది. స్నేహం ముసుగులో 14 ఏళ్ల బాలికకు డ్రగ్స్​ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఏడుగురు. కేరళ మలప్పురం జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనపై జరిగిన దాడిని బంధువులకు 10 రోజుల క్రితం తెలపగా.. చైల్డ్​లైన్​కు వచ్చిన సమాచారంతో​ ఈనెల 17న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఆమెకు ఇద్దరు నిందితులు గంజాయి వంటి మత్తు పదార్థాలు ఇచ్చారని.. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు. మిగతా వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లగా.. తల్లి, సోదరుడు, తాతతో కలిసి ఉంటోంది. గత ఎనిమిది నెలలుగా తన తల్లి ఫోన్​ ద్వారా ఇన్​స్టాగ్రామ్​ వినియోగిస్తోంది బాలిక. నిందితులంతా.. ఇన్​స్టాగ్రామ్​ స్నేహితులే. వారంతా 19-24 మధ్య వయస్కులుగా గుర్తించారు.

నిందితులపై ఐపీసీ సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికకు డ్రగ్స్​ ఇచ్చిన ఇద్దరిపై జువనైల్​ యాక్ట్​ 77 కింద కేసు నమోదు చేశామన్నారు.

ఇదీ చూడండి: 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.