ETV Bharat / bharat

కరోనాను జయించిన 13 మంది కుటుంబ సభ్యులు

author img

By

Published : May 13, 2021, 5:22 PM IST

Updated : May 13, 2021, 5:31 PM IST

కర్ణాటకలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా పాజిటివ్​గా నిర్దరణ అయిందంటే చాలు భయంతో కుప్పకూలిపోతున్న వారు అనేక మందిని చూస్తూనే ఉన్నాం. అయితే కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది కరోనాను జయించారు. మహమ్మారి నిర్ధరణ కాగానే భయపడవద్దని.. వైద్యుల సలహాలను పాటించాలని సూచిస్తున్నారు.

13 people of the same family won against Corona in Karnataka
కరోనాను జయించిన ఒకే కుటుంబానికి చెందిన 13 మంది!

కరోనాను జయించిన 13 మంది కుటుంబ సభ్యులు

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో దత్తాత్రేయ బీరా గౌడ అనే రైతు కుటుంబానికి చెందిన 13 మంది సభ్యులు కరోనాను జయించారు. సిద్దాపూర్ తాలూకా హుడ్గర్ గ్రామానికి చెందిన ఆ రైతు ఇంట్లో వివాహ వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండగా వారంతా కరోనా బారిన పడ్డారు. వీరిలో ఏడేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు ఉన్నారు. పాజిటివ్​గా తేలిన నాటి నుంచి ఇంట్లోనే చికిత్స తీసుకున్న వారంతా.. ఇటీవల కోలుకున్నారు.

జ్వరంతో మొదలు..

మొదట జ్వరం లక్షణాలు కనిపించినప్పటికీ.. వివాహ వేడుక ఏర్పాట్లలో తలమునకలైనందున అప్పుడు అంతగా పట్టించుకోలేదని చెప్పారు. అయితే జ్వరం తగ్గని కారణంగా.. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. తొలుత ముగ్గురికి, ఆ తర్వాత 10 మందికి వ్యాధి నిర్ధరణ అయింది. దీనితో మే 13న జరగాల్సిన వివాహం వాయిదా పడింది. వైద్యుల సూచనలతో వారంతా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.

13 people of the same family won against Corona in Karnataka
కరోనాను జయించిన ఒకే కుటుంబానికి చెందిన 13 మంది!

కరోనా సోకగానే భయపడాల్సిన అవసరం లేదని.. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకొని తగిన చికిత్స తీసుకోవాలని ఆ కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: 'కరోనాకు జీవించే స్వేచ్ఛ ఉంది కదా?'

ఆ జిల్లాలో 11 రోజుల్లో 113 మంది పిల్లలకు కరోనా

Last Updated : May 13, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.