అర్ధరాత్రి రాళ్లు రువ్వుతూ బాలుడి వీరంగం.. 36 కార్లు ధ్వంసం

By

Published : Jun 18, 2022, 11:38 AM IST

thumbnail

అర్ధరాత్రి వీధుల్లో తిరుగుతూ ఇళ్లు, కార్లపైన రాళ్లురువ్వుతూ వీరంగం సృష్టించాడు ఓ 13 ఏళ్ల బాలుడు. ఈ క్రమంలో 36 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సుమారు 2 గంటలకు వచ్చిన శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని గుమ్లా ప్రాంతంలో జరిగింది. మతిస్థిమితం లేకనే బాలుడు ఇలా చేశాడని పోలీసులు వెల్లడించారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.