నడిరోడ్డుపై అడవి దున్న బీభత్సం.. ఒక్కసారిగా ఆటోను పైకి లేపి..

By

Published : Sep 12, 2022, 11:45 AM IST

Updated : Sep 12, 2022, 4:42 PM IST

thumbnail

కేరళలోని పథనంతిట్టలో ఓ అడవి దున్న బీభత్సం సృష్టించింది. అంగమూజి-ప్లాపల్లి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై దాడికి దిగింది. కొమ్ములతో ఆటోను ఒక్కసారిగా పైకి లేపి పడేసింది. ఈ ఘటనలో ఆటో స్వల్పంగా దెబ్బతింది. తర్వాత మరోసారి ఆటోపై దాడిచేసేందుకు యత్నించింది. అదే సమయంలో చాకచక్యంగా వాహనాన్ని వెనక్కి పోనిచ్చాడు డ్రైవర్. చివరకు ఆ దున్న పక్కకు వెళ్లిపోయింది. ఈ సంఘటనను మెుత్తం రోడ్డుపై వెళ్తున్న మరో వాహనంలోని ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Sep 12, 2022, 4:42 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.