విడుదల కాని బకాయిలు - నిలిచిపోయిన రోడ్డు పనులు - ప్రజలకు తిప్పలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 1:02 PM IST

thumbnail

Venkatagiri-Gudur Road worst in Tirupati District: తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి గూడూరు వెళ్లే రహదారి వైపు వెళ్లాలంటే ప్రయాణికులు హడలిపోతున్నారు. దాదాపు 21 కిలోమీటర్ల మేర రహదారిలో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా రోడ్లు మారాయి. ఈ రహదారి నిర్మాణానికి 2022 అక్టోబర్‌లో సుమారు 40 కోట్ల రుపాయలతో ఎమ్మెల‌్యే ఆనం రామనారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణం, రోడ్డు విస్తరణ, కల్వర్టుకు సంబంధించిన పనుల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని ప్రశ్నించినందుకు అధిష్ఠానం పక్కన పెట్టిందని రామనారాయణరెడ్డి వెల్లడించారు. దాదాపు 9 కోట్ల రుపాయల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సదరు కాంట్రాక్టరు రోడ్డు పనులను నిలుపుదల చేశారు. రోజురోజుకూ ఈ రహదారి మరీ దారుణంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు.

రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడటంతో ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. వర్షం వస్తే ఎక్కడ గుంతలు ఉన్నాయో కూడా తెలియనంతగా ఉంటుంది. ఈ సమస్యను ప్రభుత్వం తొందరగా పరిష్కరించాలి.- వాహనదారులు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.