సత్తెనపల్లిలో సెక్షన్ 144- ప్రజలు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి - Section 144 in Sattenapalli

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 5:09 PM IST

Updated : May 15, 2024, 7:02 PM IST

thumbnail
సత్తెనపల్లిలో సెక్షన్ 144 అమలు- ప్రజలు సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి (ETV Bharat)

Section 144 in Sattenapalli Constituency: పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ రోజు గొడవకు పాల్పడిన వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంధ్యారాణి స్థానిక దుకాణాలను మూసివేయిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.  కలెక్టర్ శివశంకర్ ఆదేశాల మేరకు రెండ్రోజుల పాటు సత్తెనపల్లిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. సెక్షన్ అమలులో తమకు పట్టణంలోని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడివారు అక్కడే గృహాల వద్దనే ఉండాలని, బయట గుమిగూడరాదని, అవాంఛనీయ ఘటనలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

మరోవైపు సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకలగుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం నేత కనుమూరి బాజీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు భారీగా గ్రామానికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడితోనే కనుమూరిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి దాడులు, ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే బాజీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : May 15, 2024, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.