వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయిన కీసర టోల్​ప్లాజా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2024, 12:54 PM IST

thumbnail

Traffic Jam at Hyderabad Vijayawada Highway : సంక్రాంతి పండుగకు సొంతూరి బాటపట్టిన జనాలతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ ​- విజయవాడ రహదారి రద్దీగా మారింది. ఎన్టీఆర్​ జిల్లా కంచికచర్ల మండలం కేసర గ్రామం వద్ద టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు దాదాపు 35000 వాహనాలు కేసర టోల్ ప్లాజా మీదుగా విజయవాడ వైపు వెళ్లాయని నిర్వాహకులు తెలిపారు. మాములు రోజుల్లో కన్నా 15000 వాహనాలు అదనంగా వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇంకా వాహనాలు వచ్చే సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి ఉందని తెలియజేశారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రాపిక్​ సమస్యలతో వాహనదారులు ఇబ్బంది పడుతుంటే, నందిగామ సమీపంలో పోలీసులు హైవే పై తనిఖీలు చేస్తున్నడం వల్ల మరింత జాప్యం అవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. దీనికి తోడు నందిగామ హైవే విస్తరణ పనులు ఆగిపోవడంతో కిలోమీటరు మేర ఆధ్వానంగా ఉందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ దహదారిపై ఆదివారం, సోమవారం సాయంత్రం వరకు వాహనాల రద్దీ కొనసాగే పరిస్థితి ఉంది. హైదరాబాదు నుంచి వచ్చే వాహనాలతో జాతీయ రహదారి సందడి నెలకొంది. జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్లు ఇతర వ్యాపారాలు సంస్థలు వద్ద పెద్ద సంఖ్యలో జనం ఆగుతున్నారు. దీంతో హోటల్ వద్ద ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.