ETV Bharat / politics

డీజీపీని కలిసిన టీడీపీ నేతలు - పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - TDP leaders complained to DGP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 8:21 PM IST

TDP Leaders Complained to DGP: మాచర్లలో పథకం ప్రకారమే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులకు పాల్పడ్డారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి టీడీపీ నేతలు మెమోరాండం సమర్పించారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్‌ను డీజీపీకి అందజేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించిన పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

TDP leaders complained to DGP
TDP leaders complained to DGP (ETV Bharat)

డీజీపీని కలిసిన టీడీపీ నేతలు (ETV Bharat)

TDP Leaders Complained to DGP: ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం నేతల బృందం డీజీపీని కలిసి మెమోరాండం ఇచ్చారు. నేతల బృందం పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఫుటేజ్ ను డీజీపీకి అందజేశారు. పోలింగ్ రోజు తర్వాత రోజు ఒక పథకం ప్రకారం పిన్నెల్లి దాడులు చేసారని మాచర్ల తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. మాచర్లలో అరాచకం సృష్టించాలని పిన్నెల్లి నామినేషన్ రోజు నుంచి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్ర కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పిన్నెల్లి పై 307 కేసు పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేసారు. పిన్నెల్లి పై అనర్హత వేటు వేయాలన్నారు. సీఎస్ జవహర్ రెడ్డి వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొన్నాయని విమర్శించారు. పిన్నెల్లి మాచర్లను సొంత సామ్రాజ్యంగా తయారు చేసుకున్నాడనేది డీజీపీకి వివరించామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వెల్లడించారు. మాచర్లను పిన్నెల్లి, చంద్రగిరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తాడిపత్రిని పెద్దారెడ్డి సొంత సామ్రాజ్యాల్లా మార్చుకున్నారని దుయ్యబట్టారు. కౌంటింగ్ రోజు కూడా వీరు బయట కనపడకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి, వర్ల రామయ్య, దేవినేని ఉమా, పిన్నెల్లి దాడిలో గాయపడ్డ నంబూరి శేషగిరిరావు డీజీపీని కలిసినవారిలో ఉన్నారు.

పారిపోవాలనుకున్న పిన్నెల్లి - పట్టుకున్న పోలీసులు ! - Pinnelli in Police Custody

ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని తెలిపారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రత్యర్థులపై పిన్నెల్లి బ్రదర్స్ అతని అనుచరులు కలిసి దాడులకు తెగబడ్డారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పోలింగ్ రోజు వారు సృష్టించిన అరాచకాలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ అరాచకాలన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పోలీసులు వైఎస్సార్సీపీ గూండాలకు అడ్డుచెప్పడం మానేసి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విమరించారు. పోలింగ్ రోజున పిన్నెల్లి స్వయంగా ఈవీఎమ్ ను బద్దలు కొట్టడం, తెదేపాకి ఓటు వేసిన సానుభూతి పరులపై దాడులకు పాల్పడటం వంటి ఘటనలు వైఎస్సార్సీపీ ఓటమి పాలవుతుందని భయంతో అరాచకాలకు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేసారు. ఈ ఘటనలపై ఎన్నికల కమీషన్, పోలీసు వ్యవస్థ పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు.

పారిపోవాలనుకున్న పిన్నెల్లి - పట్టుకున్న పోలీసులు ! - Pinnelli in Police Custody

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.