Purandeshwari Comments on Appointment of TTD Board Members: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై కోర్టుకెళ్లి విజయం సాధించాం: పురందేశ్వరి
Purandeshwari Comments on Appointment of TTD Board Members: తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు నూతన సభ్యుల నియామకంపై కోర్టుకెళ్లి విజయం సాధించామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. టీటీడీ బోర్టు సభ్యుల నియామకంపై నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నారని అన్నారు. సభ్యుల నియామకం వివరాలు కోర్టు సమర్పించమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని సాయిబాబా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెద్ద దుమారమే రేపాయి.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను దేశంలోని బీజేపీ నాయకులు అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల టీటీడీ బోర్టులో జరిగిన నియామకాలపై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బోర్డులో సభ్యులుగా నియమించడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బోర్డులో నియమించిన సభ్యులలో నేర చరిత్రలు కలిగిన వారు ఉన్నారని అలాంటి వారిని దేవస్థానంలో ఎలా చోటు కల్పిస్తారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.