దూసుకొచ్చిన భారీ బండ.. కార్లు నుజ్జునుజ్జు.. ఇద్దరు మృతి

By

Published : Jul 5, 2023, 7:33 AM IST

thumbnail

Nagaland Road Accident : నాగాలాండ్​లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదం దిమపుర్​ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది..
దిమపుర్ జిల్లాలోని చుమౌకెడిమలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి ఓ భారీ బండరాయి అతివేగంగా దొర్లుకుంటూ.. దిమపుర్ - కోహిమా నేషనల్​ హైవేపై 'పాలక్ పహార్' వద్ద ఉన్న కార్లపై పడింది. కొద్ది క్షణాల్లోనే మరో బండరాయి ఇంకో కారుపై పడింది. దీంతో మూడు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మరణించిన వారి గుర్తింపు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి గురైన కార్ల వెనుక ఉన్న మరో వాహనంలోని ఓ వ్యక్తి.. ఈ ఘటనను వీడియో తీశాడు.  ప్రమాదం పట్ల నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 4 లక్షల ఎక్స్​గేషియా ప్రకటించారు. జాతీయ రహదారి వెంబడి ప్రమాదకర ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత ప్రమాణాలు మెరుగుపర్చడానికి  రాష్ట్ర ప్రభుత్వం.. భారత ప్రభుత్వం, నేషనల్ హైవే నిర్వాహకులతో కలిసి చర్యలు తీసుకుంటామని సీఎం నెఫ్యూ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.