MP Raghuramakrishnam Raju harsh comments on Cm Jagan: 'రిషికొండపై నిర్మిస్తున్నవి అక్రమ కట్టడాలు.. ఆ ఇద్దరు మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదు'

By

Published : Aug 14, 2023, 3:44 PM IST

thumbnail

MP Raghuramakrishnam Raju harsh comments on Cm Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, మంత్రులు రోజా, అమర్‌న్నాథ్‌లపై.. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకానికి సంబంధం లేకుండా.. రుషికొండలో జగన్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపించారు. టూరిజం ముసుగులో ముఖ్యమంత్రి ఇల్లు, వ్యక్తిగత అవసరాల కోసం కార్యాలయాన్ని కడుతున్నారని పేర్కొన్నారు. అతిథి గృహాలను వేరొకరి పేరు మీద పెట్టి.. 99 సంవత్సరాల కోసం లీజుకు ఇచ్చి.. జగన్ దంపతులు సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రుషికొండలో కడుతున్న గెస్ట్‌హౌస్‌లను జగన్ దంపతులు సొంతం చేసుకునే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ నిర్మాణాలను అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే కూల్చేయాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు.

MP Raghurama Raju fire on Ministers Roja, Amarnath:  రిషికొండపై నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి.. ఆదివారం రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్‌లో చేసిన ట్వీట్‌పై ఆ పార్టీ ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'' రిషికొండ వద్ద అధికారిక భవనాలు కట్టుకుంటే తప్పేంటని ముందు ట్వీట్ చేశారు. ఆ తర్వాత మా పార్టీ మళ్లీ వెనక్కి తీసుకుంటూ.. ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో భవనాలు కడితే తప్పేంటని రోజా, అమర్నాథ్‌లు అన్నారు. ఆ ఇద్దరు మంత్రులకు కనీస పరిజ్ఞానం లేదనేందుకు నేనేమి సంకోచించను. సీఆర్‌జెడ్‌ జోన్‌లో కొన్ని పరిమితులు ఉంటాయన్న విషయం ఆ మంత్రులకు తెలియదా..?. పర్యాటకానికి సంబంధం లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. సీఎం ఇల్లు, తాత్కాలికంగా ఉండేందుకు కార్యదర్శుల కోసం నిర్మిస్తున్నారు. రిషికొండ వద్ద నిర్మిస్తున్న నిర్మాణాలు.. అక్రమ కట్టడాలు. నేను సుప్రీంకోర్టుకెళ్లా.. అక్రమ కట్టడాలని 13 పేజీల ఆర్డర్ ఇచ్చింది.'' అని రఘురామ అన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.