ETV Bharat / state

హైదరాబాద్‌లో భారీ వర్షం - ఉప్పల్​ మ్యాచ్​పై అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ - RAIN IN telangana

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 4:35 PM IST

Updated : May 16, 2024, 5:07 PM IST

Thunderstorm Rain in Hyderabad: హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్​పల్లిలో మొదలై క్రమక్రమంగా సికింద్రాబాద్, అల్వాల్, బేగంపేట్, ఎల్బీనగర్ వరకు విస్తరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

హైదరాబాద్‌లో భారీ వర్షం - ఉప్పల్​ మ్యాచ్​పై అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ (ETV Bharat)

Thunderstorm Rain in Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్​లో మరోసారి వరుణుడు దండెత్తాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నగరంలోని కూకట్‌పల్లిలో ముందుగా వర్షం మొదలైంది. అక్కడి నుంచి నిజాంపేట్, హైదర్‌నగర్‌, బాచుపల్లి, సికింద్రాబాద్, బోయిన్​ పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జీడిమెట్ల, సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు విస్తరించింది. అటు హిమాయత్ నగర్, సచివాలయం, దిల్​సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మిగతా ప్రాంతాలకూ కూడా వర్షం విస్తరిస్తూ పోయింది.

అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులు - తడిసిన ధాన్యం - Effect of rain on grain crop

బంజారాహిల్స్ రోడ్ నెం.9లో వరద ఉద్ధృతికి నాలా దెబ్బతింది. నాలా గోడలు కూలడంతో సమీప నివాసాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఖైరతాబాద్ లోని చింతల్ బస్తీలో 17 చోట్ల వరద నీరు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది మ్యాన్ హోల్స్ తెరిచి వరద నీటిని మళ్లిస్తున్నారు. మరోవైపు భారీవర్షంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వాననీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖ ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేశారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. బల్దియా సిబ్బంది వాటిని తొలగించే పనిలో ఉన్నారు. ఆఫీస్ వేళలు ముగిసే సమయం కావడం, మరోవైపు వాననీరు భారీగా రోడ్లపై చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

వర్షం ఎఫెక్ట్ - గుజరాత్, కోల్​కతా మ్యాచ్ రద్దు - IPL 2024

Heavy Rain in Telangana : మరోవైపు హైదరాబాద్​లో కురుస్తున్న వర్షం ప్రభావం ఇవాళ ఉప్పల్​లో జరగనున్న సన్​రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటన్స్ మధ్య ఎక్కడ పడుతుందోనని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఉప్పల్‌ పరిసరాల్లో ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురుస్తోంది. మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ రాత్రి 7 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లే ఆఫ్‌ చేరుకోవాలంటే సన్‌రైజర్స్ టీమ్ ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాగకపోతే అది సన్​రైజర్స్ ప్లై ఆఫ్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40- 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భారీ వర్షాలు పడనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుంది.

GHMC on Rain : హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు నగరంలోని జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్‌తో మేయర్ మాట్లాడారు. నీరు నిలిచే ప్రాంతాలు, నాలాల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, రోడ్లపై నిలిచిన వరదనీరు త్వరగా తొలగించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ వర్షం కురస్తోంది, మార్కెట్‌లో ధాన్యం కొట్టుకుపోయింది. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలంలో భారీ వర్షం పడుతుండగా నాగారంలో కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దయింది. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌లో భారీ వర్షం కురుస్తుండంతో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ముందుగానే నైరుతి రుతుపవనాలు - నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు - rains in andhra pradesh

Last Updated : May 16, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.