జేసీ నివాసంలో వృద్ధుల దయనీయ స్థితి - భోజనం పెట్టేవారు లేక అల్లాడుతున్న కుటుంబసభ్యులు - JC Diwakar Reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 4:36 PM IST

thumbnail
జేసీ నివాసంలో వృద్ధుల దయనీయ స్థితి - భోజనం పెట్టేవారు లేక అల్లాడుతున్న కుటుంబసభ్యులు (ETV Bharat)

JC Diwakar Reddy Wife and Elder Sister Starving in their Residence: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో భోజనం పెట్టేవారు లేక వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి డీఎస్పీ చైతన్య జేసీ ఇంటిపై దాడిచేసి విధ్వంసం సృష్టించాడు. ఇంట్లో ఉన్న పనిమనుషులు, వంట మనుషులను విపరీతంగా కొట్టి స్టేషన్‌కు తరలించారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ జేసీ దివాకర్‌రెడ్డిని హెచ్చరించిన పోలీసులు బలవంతంగా కారు ఎక్కించి పంపించారు. అయితే పక్షవాతంతో చక్రాల కుర్చీకి పరిమితమైన దివాకర్‌రెడ్డి భార్య 78 ఏళ్ల విజయమ్మ, మంచంపైనే ఉన్న దివాకర్‌రెడ్డి సోదరి 95 ఏళ్ల సుజాతమ్మ బాగోగులు చూసుకునే వాళ్లు లేక అల్లాడిపోతున్నారు. 

పనిమనుషులు, వంట మనుషులను పోలీసులు తీసుకెళ్లడంతో వీరిద్దరి పరిస్థితి దారుణంగా తయారైంది. తల్లి కోసం తాడిపత్రికి వచ్చిన జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అడ్డగించారు. పెద్దవాళ్లకు భోజనం పెట్టే మనుషులను ఏర్పాటుచేసి వెళతానన్న పవన్‌ను చాలాసేపటి తర్వాత ఇంట్లోకి అనుమతించారు. అయితే త్వరగా వెళ్లిపోవాలంటూ ఆయనపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసు అధికారులకు ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.