ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్​ జయధీర్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 11:02 AM IST

thumbnail

Medical Association President: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్యులకు సౌకర్యాలు సరిగా లేవని, ప్రభుత్వ వైద్యులకు క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్​ జయధీర్ అన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని గుంటూరులో గురువారం ఎన్నుకున్నారు. ప్రభుత్వ వైద్యుల సమస్యలను సర్కారు పరిష్కరించాలని కోరారు. ఆరోగ్య సురక్షా లాంటి కార్యక్రమాలకు వైద్యులు సొంత ఖర్చులతో క్షేత్రస్థాయికి వెళ్తున్నారన్నారు. 

Doctors Problems in Govt Medical Colleges: ఏజెన్సీ ప్రాంతాల్లో, పీహెచ్​సీల్లో ఉన్న వైద్యులకు నివాస వసతి కల్పించాలని కోరారు. వైద్యులందరికీ వేతనాలను సక్రమంగా ఇవ్వాలని కోరారు. దీంతోపాటు పీఆర్సీ ఇవ్వాలన్నారు. త్వరలో సీఎం జగన్​ను కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని డాక్టర్​ జయధీర్ తెలిపారు. ప్రభుత్వం సరిగా స్పందించకుంటే తాము కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్​ జేసీ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డాక్టర్​ జయధీర్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.