37 వేల మంది మహిళల 'మహా' నృత్యం- శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ వేడుక

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 6:22 PM IST

thumbnail

Maharas Dwarka 2023 Video : దేవభూమిగా పిలిచే గుజరాత్​లోని ద్వారకాలో సంప్రదాయ మహా రాస్ వేడుక అట్టహాసంగా జరిగింది. అహిర్ వర్గానికి చెందిన 37 వేల మంది మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ మహా రాస్ నృత్యం చేశారు. మహిళలంతా సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీకృష్ణుడి చిత్రం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ నృత్యాలు చేశారు. సౌరాష్ట్రలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి అహిర్ వర్గీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పలువురు ఔత్సాహిక భక్తులు విదేశాల నుంచి ద్వారకాకు విచ్చేశారు. ఏసీసీ సిమెంట్ కంపెనీ క్యాంపస్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారతీయ అహిరణి మహారాస్ సంఘటన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

రాక్షస రాజు బనాసుర కుమార్తె ఉషకు గుర్తుగా అహిర్ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధ భార్యే ఈ ఉష. అనిరుద్ధతో ఉష ప్రేమలో పడటం, వారి వివాహానికి సంబంధించిన కథలు భాగవత పురాణంలో ఉన్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.