Pothina Mahesh Questioned To CM: "వివేకా హత్యతో సంబంధం లేకపోతే అవినాష్ రెడ్డి ఎందుకు పారిపోతున్నారు"
Published: May 23, 2023, 2:09 PM

Janansena Pothina Mahesh Questioned CM Jagan : అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ ఆయన చేశారు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయటానికి వస్తే రాష్ట్ర పోలీసులు ఎందుకు సహకరించటం లేదని నిలదీశారు. దీనిపై డీజీపీ స్పందించాలన్నారు. కర్నూలులో మీడియాపై దాడులు జరుగుతున్న కూడా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న.. అవినాష్ రెడ్డి రౌడీలను, వైసీపీ గుండాలను పోలీస్ శాఖ వారు ఎందుకు నియంత్రించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలని కోరారు. ప్రత్యేక అనుమతులు తీసుకుని వచ్చి అవినాష్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.