Fire Accident In Old Equipment Godown: కడప శివారులో అగ్నిప్రమాదం.. రూ. కోట్లలో ఆస్తి నష్టం..

By

Published : Aug 22, 2023, 11:46 AM IST

thumbnail

Fire Accident In Old Equipment Godown: కడప శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లునట్లుగా బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకపోవటంతో అక్కడున్న వారు ఊపీరి పీల్చుకున్నారు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప శివారులోని బుడ్డాయిపల్లె వద్ద భరత్​ నాయక్​ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా పాత సామగ్రి గోడౌన్​ నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం వేకువజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సహయంతో భరత్​ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. గోడౌన్​లో ఉన్నది ప్లాస్టిక్​ సామాగ్రి కావటంతో.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో దాదాపు కోటిన్నర విలువచేసే సామాగ్రి కాలిపోయినట్లు భరత్​ వివరించారు. షార్ట్​ సర్క్యూట్​ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఆ ప్రాతంలో దట్టమైన పొగ వ్యాపించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పక్కనున్న దుకాణాలకు వ్యాపిస్తాయోమోనని యాజమానులు భయాందోళనకు గురయ్యారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.