భూ సమస్యపై అధికారులతో విసిగిపోయిన రైతు - కుటుంబంతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన
Farmer Dharna In Front Of Collectorate Office In Karnool : సాగు చేసుకుంటున్న పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదుచేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలంటూ... కర్నూలు కలెక్టరేట్ ముందు ఓ రైతు కుటుంబం ధర్నాకు దిగింది. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఆనంద్‌కు పెద్దల ద్వారా వచ్చిన 58 ఎకరాల పొలం ఉంది. రిజిస్ట్రేషన్ అడంగల్‌లో తమ కుటుంబసభ్యుల పేరిట ఉన్నా... ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదని ఆనంద్ వాపోతున్నాడు. అధికారులకు విన్నవించినా న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు.
Land Issue Dharna In Karnool 2023 : సర్వే నెంబర్ 222 తమ పెద్దవారి పేరు మీద ఉన్న భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించమని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో తమ భూమిని నమోదు చెయ్యాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నోసార్లు అధికారులను కలిసినప్పటికీ వారు స్పందించలేదని, అందుకే ఇలా ధర్నా చేపట్టాల్సి వచ్చిందని రైతు ఆనంద్ తెలిపారు. కుటుంబం అంతా కలిసి ఇలా రోడ్డెక్కి ధర్నా చెయ్యడాన్ని స్థానికులు వింతగా చూస్తున్నారు.