Dussehra Navratri Celebrations 2023 at Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు.. దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 11:21 AM IST

thumbnail

Dussehra Navratri Celebrations 2023 at Indrakeeladri: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్దలతో వైభవంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరాయి. అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు అభయమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. దుర్గాష్ఠామిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాడ విశ్వాసం.

Dussehra Celebrations at Kanaka Durga Temple : దుర్గగుడి పండితుడు నాగరాజు శర్మ మాట్లాడుతూ.. దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో దుర్గమాసురుడు అనే రాక్షసుడిని అష్టమి తిధి రోజున సంహారించిందని.. అందుకే దుర్గగా కీర్తించబడుతుందని తెలిపారు.  "దుర్గే దుర్గతి నాశని" అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుందని, అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్టించి ఉంటుందని, బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద దుర్గమాసురుడు మహిషురుణ్ని తొక్కిపట్టి ఉంచుతూ దర్శనం ఇస్తుందని వివరించారు. భవానీ మాలధరణ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని నాగరాజు శర్మ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.