రఘురామ కృష్ణరాజు పిటిషన్​పై హైకోర్టులో వాదనలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 2:57 PM IST

thumbnail

 AP High Court hearing on Raghu Rama Krishna Raju Petition: రాష్ట్రంలో జరుగుతున్న ఆర్ధిక అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. సీఎం జగన్ తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఆరోగ్య పరికరాలు, కొన్ని కాంట్రాక్టులు తమకు అనుకూలమైన వారికి ఇచ్చారని అన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. 

ఆరోపణలు: ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఆయన సన్నిహితులకు లబ్ది చేకూరే విధంగా అక్రమాలకు పాల్పడ్డారని రఘరామ ఆరోపించారు. జగన్  అక్రమాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు, కోర్టు పర్యవేక్షణలో సీబీఐతో దర్యాప్తు జరిపిచాలని  రఘురామ హైకోర్టులో పిల్ వేశారు. జగన్ నిర్ణయాల వల్ల ఖజానాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విన్నవించారు. ముఖ్యమంత్రితో పాటు సమాచార పౌర సంబంధాల ముఖ్య కార్యదర్శి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు, ప్రకటనలను సీఎం జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్‌కు ఇస్తున్నారని, తద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.