జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను మర్చిపోయాడు - డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మె : అంగన్వాడీ వర్కర్స్
Anganwadi Strike 2023 in vijayawada : తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 8నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌తో సమ్మె చేస్తామన్నారు. మరణించిన అంగన్వాడీలకు 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, ఫేస్ యాప్ లను రద్దు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని, అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని వారు హెచ్చరించారు.
Anganwadi Workers Protest In andhrapradesh : అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. పనిభారం పేరుతో... అందించాల్సిన నాణ్యమైన సరుకులు అందించడం లేదని వాపోయారు. అంగన్వాడీ వర్కర్ల విషయంలో రాజకీైయాలు అధికంగా ఉన్నాయని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు ఆరోపించారు.