Amaravati Ring Road case: ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్​పై.. వాదనలు రేపటికి వాయిదా...

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 9:48 PM IST

thumbnail

Amaravati Ring Road case: అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని... నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వర్చువల్​గా వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ పై తదుపరి వాదనలు రేపు మధ్యాహ్నం 2 గంటల అనంతరం వింటామని హైకోర్టు వెల్లడించింది. సీఐడీ (CID) తరఫు న్యాయవాది ఏజీ శ్రీరామ్ రేపు హైకోర్టులో వినిపించనున్నారు. 

కేసు వివరాలు: గతంలో ఏపీ రాజధాని అమరావతి నగరానికి సంబంధించిన బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌ రూపొందించారు. ఈ ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 2022 ఏప్రిల్‌ 27వ తేదీన ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా... అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో  చంద్రబాబును మొదటి నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ... చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.