డ్రైవర్​ నిర్లక్ష్యం.. చిన్నారి తలమీదుగా దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే!

By

Published : Jun 12, 2022, 11:45 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

పంజాబ్​లోని లుధియానాలో విషాదం చోటుచేసుకుంది. షాహీద్ కర్నైల్​ సింగ్​ నగర్​లో అక్కతో కలిసి దుకాణానికి వెళ్తున్న ఓ ఏడాదిన్నర చిన్నారి కారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ఎదుటే ఉన్న షాప్​కు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా కిందపడిపోయింది చిన్నారి. తనను లేపేందుకు ఆమె అక్క ప్రయత్నిస్తుండగానే.. షాప్​ ఎదుట ఉన్న కారు.. చిన్నారి తల మీదుగా వెళ్లింది. దీంతో పాప అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి మృతదేహాన్ని పట్టుకొని ఆమె తల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కన్నీరు పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నడుపుతున్న వ్యక్తి ఆ సమయంలో ఫోన్​లో మాట్లాడుతున్నట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. సత్వరమే నిందితుడిని శిక్షించి పాపకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు సహా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.