గ్యాస్ సిలిండర్ ట్రక్కులో పేలుడు భారీగా ఎగిసిపడిన మంటలు

By

Published : Dec 14, 2022, 11:06 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కులో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సిలిండర్లు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఓ సిలిండర్ భాగం భగవాన్ పెట్రోల్ పంపులోని వాటర్ ట్యాంక్‌లో పడింది. ఈ ప్రమాదంలో సమీపంలో ఉన్న ఓ హోటల్‌ కూడా దగ్ధమైంది. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగింది.

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.