ETV Bharat / state

BJP COMPLAINT: బద్వేలులో వైకాపా అధికార దుర్వినియోగం.. చర్యలు తీసుకోండి: భాజపా

author img

By

Published : Oct 25, 2021, 1:41 PM IST

Updated : Oct 25, 2021, 4:24 PM IST

వైకాపాపై భాజపా ఫిర్యాదు
వైకాపాపై భాజపా ఫిర్యాదు

కడపలోని ఆర్​అండ్​బి అతిథి గృహంలో ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్​ను భాజపా నేతలు(bjp leaders meet election observer bhishma kumar) కలిశారు. వైకాపా నాయకులు, మంత్రులు.. బద్వేలులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతోపాటు తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కడప ఆర్​అండ్​బి అతిథి గృహంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు భీష్మకుమార్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ నాయకులు కలిశారు(bjp leaders meet election observer bhishma kumar). బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతోపాటు తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని వైకాపా నాయకులు, మంత్రులపై ఫిర్యాదు చేశారు(bjp leaders over ycp).

బద్వేలు నియోజకవర్గంలో వెంటనే కేంద్ర పారామిలటరీ బలగాలను రప్పించాలని కోరారు. పోలింగ్ బూతులో తమ పార్టీ ఏజెంట్లు కూర్చోకుండా ఇప్పటి నుంచే స్థానిక పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని వివరించారు. ప్రచారంలో వాలంటీర్లను కూడా వినియోగిస్తున్నారని విన్నవించారు.

అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నారని.. ఆధారాలను ఎన్నికల పరిశీలకలకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్.. బద్వేలు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సోము వీర్రాజుతోపాటు ఎంపీలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవ్ దర్, సత్యకుమార్, మాజీమంత్రి ఆదినారాణరెడ్డి.. ఎన్నికల పరిశీలకులను కలిశారు.

భాజపాతోనే బద్వేలులో అభివృద్థి: పరిపూర్ణ నందస్వామి

రాజకీయాలంటే ఎమోషన్స్ కాదని.. బద్వేలు అభివృద్థి బీజేపీతోనే సాధ్యమని శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణ నందస్వామి(Paripoornananda Swami elction campaign at badvel) అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా ఆయన బద్వేలులో పర్యటించారు(Paripoornananda Swami visit badvel). సీఎం జగన్.. బద్వేలు అభివృద్ధిపై దృష్టిసారించలేదని.. బద్వేలులో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 'బద్వేలులో భాజపా అభ్యర్థి పనతల సురేష్(badvel bypoll bjp candidate suresh) విద్యావంతుడు. విద్యార్థి దశ నుంచి జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. బద్వేలు అభివృద్ధి కావాలంటే భాజపా అభ్యర్థి సురేష్‌ను గెలిపించుకోవాలి. ఎమోషన్లు కావాలో..అభివృద్ధి కావాలో బద్వేలు ప్రజలు తేల్చుకోవాలి. అసెంబ్లీలో బద్వేలు అభివృద్థిపై మాట్లాడే వ్యక్తి సురేశ్​' అని చెప్పుకొచ్చారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అని స్పష్టం చేశారు. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో వ్యక్తినే ఎన్నుకోవాలను కోవడం సరికాదన్నారు. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని గెలిపించాలని పరిపూర్ణానంద స్వామి కోరారు.

ఇదీ చదవండి

Last Updated :Oct 25, 2021, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.