ETV Bharat / city

TDP LEADERS DELHI TOUR: దిల్లీ చేరుకున్న తెదేపా నేతల బృందం..

author img

By

Published : Oct 25, 2021, 9:34 AM IST

Updated : Oct 25, 2021, 12:31 PM IST

చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా సభ్యుల బృందం దిల్లీ చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12.గం.కు బృందంలోని ఐదుగురు సభ్యులు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ని కలవబోతున్నారు.

TDP chief Chandrababu Naidu arrived in Delhi with 18 members
దిల్లీ చేరుకున్నతెదేపా నేతల బృందం

చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా నేతల బృందం దిల్లీ చేరుకుంది. ఈరోజు మధ్యాహ్నం 12.గం.కు బృందంలోని ఐదుగురు సభ్యులు రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించి.. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కోరనున్నారు. ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పెరిగిపోతోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఫిర్యాదు చేయనున్నారు. అలాగే.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై రామ్​నాథ్ కోవింద్​కి సమగ్ర నివేదిక ఇవ్వబోతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసేందుకు కోసం సమయం కోరారు. అనంతరం తెదేపా నేతల బృందం పలువురు కేంద్రమంత్రులను కూడా కలవబోతోంది.

ఇదీ చూడండి: Actor died: టాలీవుడ్ నటుడు రాజబాబు మృతి

Last Updated :Oct 25, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.