ETV Bharat / state

Visakha Steel Plant Decided to Lease Land: విశాఖ ఉక్కు భూముల కోసం కార్పొరేట్​ వార్​.. మళ్లీ అదానీ చేతుల్లోకేనా..!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 7:17 AM IST

Updated : Aug 27, 2023, 7:24 AM IST

visakha_steel_plant_decided_to_lease_land
visakha_steel_plant_decided_to_lease_land

Visakha Steel Plant decided to lease land: విశాఖ స్టీల్‌ ప్లాంట్ భూములపై కార్పొరేట్‌ సంస్థల మధ్య యుద్ధం నడుస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు గంగవరం పోర్టు సమీపంలోని స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 11 వందల 52 ఎకరాల భూములను లీజుకిచ్చేందుకు స్టీల్‌ ప్లాంట్ యాజమాన్యం అడుగులు వేస్తోంది. వీటిని లీజుకు తీసుకునేందుకు ఎన్​ఎండీసీ ప్రయత్నాలు చేస్తోంది. విషయం తెలుసుకున్న అదానీ సంస్థ భూములను వారికి కేటాయించకుండా ఉక్కు మంత్రిత్వశాఖ వద్ద చక్రం తిప్పుతోంది.

Visakha Steel Plant Decided to Lease Land: విశాఖ ఉక్కు భూముల కోసం కార్పొరేట్​ వార్​.. మళ్లీ అదానీ చేతుల్లోకేనా..!

Battle Between Corporate Companies Over Steel Plant Lands: విశాఖ ఉక్కు భూముల కోసం కార్పొరేట్‌ సంస్థల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం దృష్టి సారించింది. నగరంలోని హెచ్‌బీ కాలనీ, ఆటోనగర్‌ పరిధిలోని రూ. 1500 కోట్ల విలువైన 25 ఎకరాల ఉక్కు ఆస్తుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ప్రకటనలు జారీ చేసింది. తాజాగా గంగవరం పోర్టు సమీపంలోని స్టీల్‌ ప్లాంటుకు చెందిన 11 వందల 52 ఎకరాల్ని లీజుకిచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ భూములను లీజుకు తీసుకోవడానికి ఎన్‌ఎండీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్‌ఎండీసీకి జాయింట్‌ వెంచర్‌గా జిందాల్‌ సంస్థ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అదానీ సంస్థ గంగవరం పోర్టుకు సమీపంలోని భూములను ఈ జాయింట్‌ వెంచర్‌కు కేటాయించొద్దని ఉక్కు మంత్రిత్వశాఖపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం.

Visakha Steel Committee protest : విశాఖలో కొనసాగుతున్న కార్మికుల దీక్ష.. నేడు అమిత్ షా పర్యటన

Establishment of Pellet Plant under Steel Plant: పదేళ్ల కిందటే స్టీల్ ప్లాంట్‌ ఆధ్వర్యంలో పెల్లెట్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలనే కసరత్తు సాగింది. ప్రత్యేక అధికారులతో ఓ విభాగం ఏర్పాటు చేసి ప్రణాళికలు చేశారు. నిధుల కొరత, కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపకపోవడంతో ఆ ఆలోచన ముందుకు కదల్లేదు. తాజాగా ఎన్​ఎండీసీ ఆ ప్లాంటు ఏర్పాటుకు ఆర్​ఐఎన్​ఎల్​ భూములు లీజుకివ్వాలని కోరింది. స్టీలు తయారీలో పెల్లెట్ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం విశాఖ ప్లాంటుకు పెల్లెట్లను కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నారు. ఎన్‌ఎండీసీ ప్లాంటు ఇక్కడే ఏర్పాటు చేస్తే రవాణా ఛార్జీలు తగ్గే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Visakha Steel plant: విశాఖ ఉక్కుకు జాతీయ పురస్కారం.. వారి కృషితోనే సాధ్యమైందన్న ఉక్కు సీఎండీ

Gangavaram Adani Port: గంగవరం పోర్టు అదానీ చేతుల్లోకి వెళ్లాక.. పోర్టును ఆనుకుని ఉన్న ఉక్కు భూములపై ఆ సంస్థ కన్నుపడింది. ఈ భూముల్లో వెయ్యి ఎకరాలు లీజుకు దక్కించుకుని అందులో స్టాకు యార్డు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అదానీ పెట్టినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఉక్కు భూములివ్వాలని ప్రత్యక్షంగా అదానీ ప్రతిపాదనలు ఏమీ పెట్టలేదు. కానీ జాయింట్‌ వెంచర్‌ పేరుతో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ పోస్కో సంస్థతో చక్రం తిప్పి.. ఆర్​ఐఎన్​ఎల్​ భూములిస్తే.. ఆ స్థలంలో ప్లాంటు ఏర్పాటు చేసి వచ్చిన లాభాల్లో వాటా ఇచ్చేలా ప్రతిపాదన తెచ్చారు. కార్మిక సంఘాలు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిపోయింది. ఎన్‌ఎండీసీతో జాయింట్‌ వెంచర్‌గా జిందాల్‌ తెరపైకి రావడంతో, గంగవరం పోర్టు సమీపంలోని భూములు కేటాయించకుండా అదానీ పావులు కదుపుతున్నట్లు విమర్శలున్నాయి.

Visakha Steel Plant Privatization: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆందోళన.. నిర్వాసితుల గోడు పట్టదా సీఎం సారూ..!

Retired IAS Officer Letter to Central Steel Secretary: గంగవరం పోర్టులో స్టాకుయార్డు అవసరాలకు అదానీ గ్రూపునకు వెయ్యి ఎకరాలు లీజుకు ఇవ్వొద్దని కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్‌ సిన్హాకు.. విశ్రాంత ఐఏస్​ అధికారి ఈఏఎస్‌ శర్మ ఇటీవల లేఖ రాశారు. ప్రస్తుత మార్కెట్‌లో ఆ భూమి విలువ 20వేల కోట్లకు పైనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ భూములు గతంలో గంగవరం పోర్టుకు కేటాయించగా.. చివరకు ఆ పోర్టును అదానీ గ్రూపు స్వాధీనం చేసుకుని విశాఖ ఉక్కును అనేక రకాల ఇబ్బందులు పెడుతోందన్నారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం పలు సెక్షన్లతో, ప్రజాప్రయోజనం పేరుతో రైతుల నుంచి స్టీల్‌ప్లాంట్‌కు సేకరించిన సారవంతమైన భూములను, అదానీ వంటి ప్రైవేటు కంపెనీకి ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు.

Last Updated :Aug 27, 2023, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.