కొత్తవలసలోని జిందాల్‌ పరిశ్రమ మూసివేత - 57 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ - Jindal Steel Plant Closed

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 1:44 PM IST

thumbnail
కొత్తవలసలోని జిందాల్‌ పరిశ్రమ మూసివేత - 57 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ (ETV Bharat)

Jindal Steel Plant Was Closed in Kothavalasa: విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్‌ ఉక్కు కర్మాగారాన్ని యాజమాన్యం మూసివేసింది. అందులో పనిచేస్తున్న 57 మంది ఉద్యోగులకు లేఆఫ్‌ ప్రకటించింది. పరిశ్రమకు ప్రధాన ముడి సరకు అందుబాటులో లేకపోవడం, ఉత్పత్తులకు మార్కెట్‌లో సరైన ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నట్లు యూనిట్‌ హెడ్‌ దినేశ్‌ శర్మ విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు. దాన్ని కంపెనీ వద్ద బోర్డులో పెట్టారు. జిందాల్‌ పరిశ్రమను తెరవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, నేతలు ఆందోళనకు దిగారు.

నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన గేటు ఎదుట నిరసన తెలిపారు. యాజమాన్యానికి సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. ఈ చర్యలతో కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాపోయారు. పరిశ్రమ మూసివేతతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిందాల్ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరుపుతున్న చర్చలు ముగిశాయి. ఒడిశా జార్జ్‌పూర్ యూనిట్‌లో పని కల్పిస్తామన్న యాజమాన్యం తెలిపింది. వేతనం పెంచాలని, అక్కడి కార్మికుల నుంచి ఇబ్బంది రాకుండా చూడాలని కార్మికులు యాజమాన్యాన్ని కోరారు. ఈ నెల మొత్తానికి జీతాలు చెల్లించాలని కార్మికుల డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లపై సోమవారం నిర్ణయం ప్రకటిస్తామని యాజమాన్యం తెలిపింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.