ETV Bharat / state

తండ్రీ, కుమార్తె అదృశ్యానికి కారణాలు తేల్చండి: హైకోర్టు

author img

By

Published : Apr 22, 2022, 2:30 PM IST

HIGH COURT ORDERS
తండ్రీ , కుమార్తె అదృశ్యానికి కారణాలు తేల్చండి- హైకోర్టు

HIGH COURT ORDERS: తండ్రి, కుమార్తెల అదృశ్యం ఘటనపై వాస్తవాలను తేల్చి , వాంగ్మూలాలను నమోదు చేసేందుకు వారిని శుక్రవారం కోర్టు ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది.

HIGH COURT ORDERS: తండ్రి, కుమార్తెల అదృశ్యం ఘటనపై వాస్తవాలను తేల్చి, వాంగ్మూలాలను నమోదు చేసేందుకు వారిని శుక్రవారం కోర్టు ముందు ఉంచేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ను హైకోర్టు ఆదేశించింది. వారి అదృశ్యంపై జిల్లా ఎస్పీ ద్వారా తక్షణం విచారణ జరిపించాలంటూ జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఆదేశాలిచ్చారు.

అసలేం జరిగిందంటే..: శ్రీకాకుళం జిల్లా హిరమండలం పరిధిలోని ఓ గ్రామంలో ఈనెల 23/24 తేదీల్లో జరగాల్సిన వివాహాన్ని పంచాయతీ కార్యదర్శి / గ్రామ స్థాయి బాల్య వివాహాల అధికారి అడ్డుకుంటున్నారని పేర్కొంటూ ఎం. ఆదినారాయణ , ఆయన కుమార్తె ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు . ఈనెల 19 న హైకోర్టులో జరిగిన విచారణలో వివరాలు సమర్పించేందుకు మహిళ శిశుసంక్షేమశాఖ ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు.దీంతో విచారణ ఈనెల 20 కి వాయిదా పడింది.

ఇదీ చదవండి: విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.