ETV Bharat / city

విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.. ఉద్రిక్తత

author img

By

Published : Apr 22, 2022, 11:58 AM IST

Updated : Apr 22, 2022, 3:52 PM IST

Tension at Vijayawada Government Hospital
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

11:56 April 22

వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న మహిళలు

విజయవాడ ప్రభుత్వాస్పత్రి దగ్గర ప్రజాసంఘాల ఆందోళన.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం ఘటనను వ్యతిరేకిస్తూ.. బాధిత కుటుంబసభ్యులు, తెలుగుదేశం నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అత్యాచార బాధితురాలి పరామర్శకు వచ్చిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను మహిళలు అడ్డుకుని.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం ఘటనను వ్యతిరేకిస్తూ.. బాధిత కుటుంబసభ్యులు, తెలుగుదేశం నేతలు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు వచ్చిన మహిళను బంధించి ముగ్గురు అతి కిరాతకంగా అత్యాచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు నున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో అత్యాచార బాధితురాలి పరామర్శకు వచ్చిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను మహిళలు అడ్డుకుని.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రి ద్వారం వద్దే బైఠాయించిన తెదేపా నేతలు, మహిళలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున మహిళల నినాదాలు చేశారు. వికలాంగురాలిపై ఘటన జరిగినా పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరవైందని... మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రోజూ ఎక్కడో ఒక దగ్గర మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. వాటిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అమ్మాయిలకు మేనమామ అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం.. వారి రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.

ఇద్దరు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నున్న సీఐ హనీష్‌కుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి... విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాను ఆదేశించారు. వెన్వెంటనే ఈ ఆదేశాలను అమలు చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు నున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా సత్వరం స్పందించకుండా సిబ్బంది ఘోర నిర్లక్ష్యం చేయడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. బాధిత కుటుంబీకులే వెళ్లి తమ కుమార్తెను కాపాడాలని కోరుకునే దైన్యస్థితి నెలకొనడంపై రాజకీయ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇరుకు గదిలో సుమారు 30 గంటలకుపైగా బంధించి ఆమెపై అత్యంత పాశవికంగా ప్రవర్తించడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

Vijayawada rape incident: విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై పోలీసుల చర్యలు చేపట్టారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటనలో ఇద్దరు పోలీసులను సీపీ కాంతిరాణాటాటా వేటు వేశారు. విధుల్లో అలసత్వం వహించినందుకు గాను సిఐ హనీష్‌, సెక్టార్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావులను సస్పెండ్​ చేశారు. కుమార్తె కనిపించలేదన్న తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై ఈ చర్యలు తీసుకున్నారు.



సంబంధిత కథనం: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Last Updated : Apr 22, 2022, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.