ETV Bharat / state

సిలిండర్ పేలి ​గుడిసె దగ్ధం..కాలి బూడిదైన రూ.10 లక్షల నగదు, విలువైన పత్రాలు

author img

By

Published : Jun 20, 2021, 9:16 PM IST

The hut burned
అగ్ని ప్రమాదంలో కాలిపోతున్న గుడిసె

ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు కూడబెట్టుకున్నారు. కానీ వారి కష్టాన్ని అగ్ని దహించి వేసింది. ఉన్న కాసింత గూడు కోల్పోయేలా చేసింది. నెల్లూరు జిల్లా ఎస్​పేట మండలం చిరమన గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.పది లక్షల నగదు కాలి బూడిదయ్యింది.

నెల్లూరు జిల్లా ఎస్​పేట మండలం చిరమన గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగి గుడిసెకు అంటుకున్నాయి. అందులో ఉన్న గ్యాస్​ సిలిండర్​ పేలి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావటంతో గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఇల్లు కట్టుకునేందుకు దాచుకున్న రూ.పది లక్షల నగదు, మూడు సవర్ల బంగారం, తన ఎంబీఏ సర్టిఫికేట్​ మంటల్లో కాలి బూడిదయ్యాయని బాధితుడు శ్రీనివాస్​ వాపోయాడు. దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతై, ఉన్న గూడు చెదిరిపోయి కట్టుబట్టలతో మిగిలామన్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.

ఇదీ చదవండి: Live Video: మట్టి మాఫియాను ప్రశ్నించిన తెదేపా నేతపై దాడి !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.