ETV Bharat / state

మద్యం, సారా, గుట్కా దందాలపై పోలీసుల ఉక్కుపాదం..!

author img

By

Published : Jul 17, 2021, 7:42 AM IST

liquor
మద్యం పట్టివేత

మద్యం అక్రమ రవాణా, గంజాయి, గుట్కా దందాలపై.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇలాంటి విషయాలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. పెద్ద మొత్తంలో సరుకు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కర్నులూ జిల్లాలో...

  • మంత్రాలయం సమీపంలో తరలిస్తున్న 898 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి తుంగభద్ర నదిలో పుట్టీల ద్వారా రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.
  • పెద్ద తుంబలం పోలీసులు ఒక లక్షల 50 వేల రూపాయల విలువైన కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదోని మండలం జాలిమంచి గ్రామ రహదారిలో తనిఖీలు చేశారు. ద్విచక్రవాహనంపై 14 బాక్సుల్లో కర్ణాటక మద్యం తరలింపును గుర్తించారు. సరుకును సీజ్ చేశారు. మునిస్వామి అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. నిందితుడి నుంచి 1248 మద్యం ప్యాకెట్లను సీజ్ చేశారు.

కడప జిల్లాలో..

కర్ణాటక నుంచి రవాణా అవుతున్న 500 నిషేధిత గుట్కా సంచుల్ని బద్వేల్​ పట్ణణంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టణానికి చెందిన సురేంద్ర, ప్రసాదు, నెల్లూరు జిల్లా అనంతసాగరానికి చెందిన రాజాను అరెస్ట్ చేసి బద్వేల్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

విశాఖపట్నం జిల్లాలో..

అనకాపల్లి మండలం జలగలమదుమ్​ వద్ద తరలిస్తున్న రూ.10.50 లక్షల విలువైన 210 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణాకు వాడిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరారయ్యారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో...

ఒడిశా సరిహద్దులోని అలమండ గ్రామం నుంచి.. టాటా మ్యాజిక్ వాహనంలో.. 20 క్యాన్లలో నాటుసారా తరిలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రవికుమార్, రమేష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.2 లక్షల విలువైన 800 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి:

మద్యం, గుట్కా పట్టివేత.. వ్యక్తి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.