ETV Bharat / state

నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో రాకపోకలు ప్రారంభం

author img

By

Published : May 26, 2020, 4:01 AM IST

flight arrival at gannavaram airport begins today
గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి రాకపోకలు ప్రారంభం

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. లాక్​డౌన్ మార్చి 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ఆగిపోయాయి. సుమారు రెండు నెలల తర్వాత దేశీయ సర్వీసులు నేటి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. లాక్​డౌన్ మార్చి 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలు ఆగిపోయాయి. సుమారు రెండు నెలల తర్వాత దేశీయ సర్వీసులు నేటినుంచి రాకపోకలు సాగించనున్నాయి. ఇవాళ చెన్నై , బెంగళూరు నుంచి రెండు సర్వీసులు రానున్నాయి. ఇండిగో విమానయాన సంస్థ చెన్నై నుంచి మంగళవారం సాయంత్రం విజయవాడకు విమాన సర్వీసు నడుపుతున్నట్టు ప్రకటించింది. బెంగళూరు నుంచి స్పైస్ జెట్ సర్వీసును నడుపుతోంది. దిల్లీ నుంచి ఎయిరిండియాకు చెందిన విమాన సర్వీసు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఏ సర్వీసులూ విజయవాడకు రావడం లేదు.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న దిల్లీ లాంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికులు వారం రోజులు ప్రభుత్వం సూచించిన క్వారంటైన్​లో ఉండాలి. తర్వాత వారం రోజులు ఇంటిలో క్వారంటైన్​లో ఉండాలి. బెంగళూరు లాంటి నగరాల నుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులు హోం క్వారంటైన్​లో ఉండాలి. కృష్ణా , గుంటూరు , పశ్చిమగోదావరి మూడు జిల్లాలకు చెందిన వాళ్లు ఇంటికి చేరేందుకు మాత్రమే ఈ సర్వీసులు వినియోగించుకోవాల్సి ఉంటుంది. పనిపై వచ్చి తిరిగి వెళ్లాలనుకునే వారికి కుదరదు. మంగళవారం పరిమితంగానే సర్వీసులు నడుస్తున్నప్పటికీ బుధవారం నుంచి రాకపోకల సంఖ్య పెరగనుందని గన్నవరం విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఇటీవల లండన్ , సౌదీ , కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల రాకపోకలకు అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని వినియోగించారు. ప్రస్తుతం దేశీయ టెర్మినల్ భవనం నుంచి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా ...చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను వినియోగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌంటర్ల వద్ద ప్రయాణికులు దూరం దూరంగా ఉండేందుకు స్టిక్కర్లను అంటించారు. వచ్చే ప్రతి ప్రయాణికుడి వివరాలను నమోదు చేసుకోవడం... వారిని క్వారంటైన్​కు పంపించడం వంటివి చేయాల్సి ఉంటుంది.

ఇదీచూడండి. తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.