ETV Bharat / state

ఓట్ల అవకతవకలపై అధికార పార్టీపై ఫిర్యాదు చేసిన విపక్షాలు- విపక్షాలపై ఫిర్యాదు చేసిన అధికార పక్షం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 10:13 PM IST

TDP has complained to ECI
TDP has complained to ECI

TDP has complained to ECI alleging irregularities in voter lists: రాష్ట్రంలో ఓట్ల చేర్పు, తొలగింపులో అక్రమాలపై తెలుగుదేశం, వైసీపీ జనసేన నేతలు, కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి విడివిడిగా ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేయగా, టీడీపీ, జనసేన నేతలు ఓట్ల తొలగింపు, చేర్పులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఫిర్యాదుచేశారు.

TDP has complained to ECI alleging irregularities in voter lists: రాష్ట్రంలో జరుగుతున్న ఓట్లు అక్రమాలపై ప్రధాన పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా వెళ్లి అధికారులను కలిసిన నేతలు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఒకే వ్యక్తి 100 ఓట్ల తొలగింపుకు దరఖాస్తు చేశారు: రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్న విధానంపై తెలుగుదేశం పార్టీ నాయకులు దుళిపాళ్ల నరేంద్ర, బోండా ఉమా, వర్ల రామయ్య, జి.వి ఆంజనేయులు తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. గంపగుత్తగా ఫామ్ 7 దరఖాస్తులు ఇవ్వడం, ఒకే వ్యక్తి 100 ఓట్ల తొలగింపుకు దరఖాస్తు చేశారని కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళామని మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ నరేంద్ర తెలిపారు. చంద్రగిరి, పర్చూరు, కాకినాడ, వినుకొండ లాంటి 7 నియోజకవర్గాల్లో కేంద్ర బృందంతో ఓటర్ల జాబితాపై పర్యవేక్షణ చేయాలని కోరామన్నారు. సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్​లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.

దరఖాస్తు చేయకుండానే ఓటర్ల వివరాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు: బీజేపీ నేతలు

ప్రలోభాలకు గురి చేస్తున్నారు: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను వైసీపీ నేతలు పేర్ని నాని, జోగి రమేష్‌, మేరుగ నాగార్జున, అబ్బయ్య చౌదరి కలిశారు. ఓట్ల తొలగింపు, చేర్పులపై టీడీపీ, జనసేన పార్టీలు చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలపాలను ఎన్నికల సంఘం ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మేనిఫెస్టో రూపంలో కాకుండా టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా ఓటర్ల ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తున్నారని తాము ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలో ఉన్న ఓటర్లు ఇక్కడ కూడా ఓటు కలిగి ఉండటాన్ని పరిశీలించాలని కొరామన్నారు. టీడీపీకి చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తి దురుద్దేశంతో తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే ఉద్దేశంతో ఇలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని చెప్పారు. కోనేరు సురేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరామన్నారు. టీడీపీకి చెందిన మై పార్టీ డాష్ బోర్డులో ఓటర్ల వ్యక్తిగత సమాచారం అంతా ఉంటుందని తెలిపారు.

'ఫాం 7 దరఖాస్తుల పరిశీలన' 80శాతం బోగస్! - విచారణకు మొహం చాటేస్తున్న వైసీపీ సానుభూతిపరులు

గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారు: ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చామని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వారు పనిచేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పామన్నారు. ఒకే డోర్ నంబర్ పై వందలాది ఓట్లు ఉన్నాయనే విషయాన్ని వారి దృష్టికి తెచ్చామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కమిషన్ దృష్టి సారించాలని కోరారు.

తమను చూసి కాదు- జగన్​ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు! : మంత్రి ఆదిమూలపు సురేశ్​

వైసీపీపై టీడీపీ జనసేన - జనసేన టీడీపీపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.