ETV Bharat / state

రాష్ట్రంలో ఎన్నికల హింసపై ఈసీకి సీఎస్‌, డీజీపీ వివరణ - CS and DGP Explanation to EC

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 7:15 PM IST

CS and DGP Explanation to EC on Violence in AP: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్‌, డీజీపీ హాజరై రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్‌ విశ్వజిత్‌ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలలో హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

dgp_explanation_to_ec
dgp_explanation_to_ec (Etv Bharat)

CS and DGP Explanation to EC on Violence in AP: ఎన్నికల సంఘం ముందు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) వ్యక్తిగతంగా హాజరయ‌్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమారవిశ్వజిత్ సైతం ఉన్నారు.

వైఎస్సార్సీపీ కనుసన్నల్లో అరాచక 'చైతన్యం' - DSP Chaitanya Violence

మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ (Central Election Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం లాంటి ఘటనలను ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఈసీకి వివరణ ఇచ్చారు.

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశం - SC Angry on Sand Mining in AP

దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థిపైనే దాడిచేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడినట్లు తెలుస్తోంది.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ అధికారిని వదిలే ప్రసక్తి లేదు - చట్టప్రకారం చర్యలు ఉంటాయి : వర్ల రామయ్య - Varla warning to erring officers

రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసిన ఈసీ అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఎందుకు స్పందించలేదనే అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై వివరాలు బయటకు రాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.