ETV Bharat / state

Nara Lokesh Emotional Speech in TDP Meeting: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ భావోద్వేగం.. చంద్రబాబు ఆశయసాధనలో నడుస్తామని ప్రకటన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2023, 8:02 PM IST

Updated : Oct 22, 2023, 6:14 AM IST

Nara_Lokesh_Emotional_Speech_at_TDP_Meeting
Nara_Lokesh_Emotional_Speech_at_TDP_Meeting

Nara Lokesh Emotional Speech at TDP Meeting in Mangalagiri: వైసీపీ అరాచకాలపై టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రాన్ని జగన్ ఎనాడో ముక్కలుగా అమ్మేసేవారని నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో..ఆయన భావోద్వేగ ప్రసగం చేశారు. చంద్రబాబు చెప్పిన కనీస విలువలతోనే రాజకీయాలు చేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 1న ప్రారంభిస్తానని ప్రకటించారు. బాబు అరెస్టు వార్త విని మృతి చెందిన కుటుంబాలను ఈ నెల 25 నుంచి తన తల్లి భువనేశ్వరి పరామర్శిస్తారని వెల్లడించారు.

Nara Lokesh Emotional Speech at TDP Meeting in Mangalagiri : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నారా లోకేశ్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆవేదనకు గురై మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ లోకేశ్‌ చేసిన కీలకోపన్యాసం ఆద్యంతం గద్గద స్వరంతో సాగింది. చంద్రబాబు కూర్చునే కుర్చీని ఖాళీగా పెట్టి సమావేశం నిర్వహించారు. ఏ తప్పు చేయకున్నా ప్రజల కోసం పోరాడిన నాయకుడు చంద్రబాబు అంటూ వేదికపై లోకేశ్‌ భావోద్వేగానికి గురయ్యారు.

Nara Bhuvaneshwari Nijam Gelavali Programe Starts From October 25th in Chandragiri : ఈ నెల 24న భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదే రోజు చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లికి వెళ్తారని లోకేశ్‌ తెలిపారు. 25 నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి 'నిజం గెలవాలి (Nijam Gelavali)' పేరిట చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. సేవా కార్యక్రమాలు తప్ప ఏం తెలియని తన తల్లిని.. అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారని ఆవేదనతో అన్నారు.

TDP Leader Nara Lokesh Emotional Speech: "ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం".. టీడీపీ నేతల ముందు లోకేశ్ కంటతడి

దొంగ ఓట్ల చేర్పుల‌పై పోరాటం ఆపొద్దు : తెలుగుదేశం-జనసేనల పొత్తు ఉండకూడదని నాలుగున్నరేళ్లుగా జగన్ చేసిన ప్రయత్నం నెరవేరలేదని లోకేశ్‌ అన్నారు. ఇరు పార్టీల మధ్య విబేధాలు సృష్టించేందుకు పేటీఎం బ్యాచ్ పనిచేస్తోందన్నారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. దొంగ ఓట్ల చేర్పుల‌పై పోరాటం ఆపొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు.

వర్షాలు లేక పంటలు ఎండి పోతుంటే వాటిని కాపాడాల్సిన జగన్.. దోపిడీలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఇసుక తమ్ముడికి, కల్తీ మద్యం మరో తమ్ముడికి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఇంటింటికీ వెళ్లి జగన్ దోపిడీని వివరిద్దామని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇరు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. "బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం" ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే నవంబర్ 1న ప్రారంభిస్తానని ప్రకటించారు.

Nara Bhuvaneshwari, Lokesh Fire on Punganur Incident: పుంగనూరు ఘటనపై భువనేశ్వరి, లోకేశ్ ఆగ్రహం..రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం

పవన్ కల్యాణ్​కి కృతజ్ఞతలు : స్కిల్ డెవలెప్మెంట్​పై నిన్న ప్రధాని చేసిన ప్రకటనతోనైనా జగన్ సిగ్గుపడి తన ముక్కు నేలకు రాయాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ పుంజుకోలేదనే తప్పుడు ఆలోచన చేసిన జగన్ బూమ్రాంగ్ అయ్యరని ఆక్షేపించారు. సరైన సమయంలో తెలుగుదేశానికి జనసేన తోడైందన్నారు. పవన్ కల్యాణ్​కి కృతజ్ఞతలు తెలిపుతున్నామన్నారు.


Lokesh Stuck in Traffic At Mangalagiri : తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి పోలీసు అడ్డంకులు సృష్టించారు. విజయవాడలో VIP మూమెంట్ ఉందంటూ దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి వద్ద ట్రాఫిక్​ను హైవే నుంచి సర్వీస్ రోడ్ లోకి మళ్లించారు. ఎన్టీఆర్ భవన్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. లోకేశ్‌తో పాటు ముఖ్య నేతలు చాలాసేపు ట్రాఫిక్​లో చిక్కుకున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమయ్యాక ట్రాఫిక్​ని పోలీసులు సర్వీస్ రోడ్డు నుంచి హైవే మీదికి వదిలారు.


Bhuvaneshwari Fires on Police Behavior Against TDP Leaders: టీడీపీ శ్రేణులపై పోలీసు నిర్బంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది: భువనేశ్వరి

Nara Lokesh Emotional Speech at TDP Meeting: టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేశ్ భావోద్వేగం.. నవంబర్ 1 నుంచి 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' ప్రారంభం
Last Updated :Oct 22, 2023, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.