ETV Bharat / state

Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!

author img

By

Published : Jul 31, 2023, 2:16 PM IST

Updated : Jul 31, 2023, 3:27 PM IST

stolen votes
stolen votes

TDP leaders fire on Kurnool Legislative Assembly stolen votes: కర్నూలు శాసనసభ నియోజకవర్గం ఓటర్ల జాబితా చర్చనీయాంశంగా మారింది. ఒకే ఇంట్లో హిందూ, ముస్లిం ఓటర్లు ఉండడం కలకలం రేపింది. 69-03-1655 అనే ఇంటి నెంబరులో 152 ఓట్లు, 01-కర్నూలు పేరుతో 922 ఓట్లు బయటపడడంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. జిల్లా కలెక్టర్, ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించి.. దొంగ ఓట్లను తొలగించాలంటూ ధర్నాకు దిగారు.

తప్పుల తడకగా కర్నూలు ఓటరు జాబితా..ఓకే ఇంటి చిరునామాతో భారీ దొంగ ఓట్లు

TDP leaders fire on Kurnool Legislative Assembly stolen votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. 26 జిల్లాల్లోని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఓకే ఇంటి నెంబర్‌తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండాపోవడంతో విపక్షాల నేతలు వాపోతున్నారు. వందేళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో పెద్దదిగా ఉండటంతో ప్రతిపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఇంటి చిరునామాతో 152 దొంగ ఓట్లు బయటపడడం.. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్, ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించి దొంగ ఓట్లను తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

తప్పుల తడకగా ఓటర్ల జాబితాలు.. కర్నూలు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నగరంలోని 17వ వార్డులో 69-03-1655 ఇంటి సంఖ్యతో 152 ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఇంటి నంబర్ జోహరాపురం ప్రాంతంలో ఉన్నట్లు జాబితాలో చూపిస్తున్నా.. ఎక్కడా కనిపించలేదని ఆగ్రహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పరిశీలించినప్పుడు.. DXS-4417846 ఓటర్ ఐడీలో ఫాతిమా, DXS-3039807లో మాలిక్ బాషా.. DXS-3039732 ఓటర్ ఐడీలో ఎల్లప్ప, DXS-3039757లో కృష్ణా అనే హిందువుల పేర్లు ఉన్నట్లు గుర్తించమన్నారు. ఒకే ఇంటి నంబరులో ఇలా హిందూ ముస్లింల పేర్లు ఎలా ఉంటాయి..? అన్నదే సందేహంగా మారిందని వ్యాఖ్యానించారు.

ఓకే డోర్ నంబర్‌తో 122 ఓట్లు.. మరో డోర్ నంబర్ 9-1-179 ఇంట్లో ఏకంగా 122 ఓట్లు ఉన్నట్లు ప్రతిపక్షా నేతలు గుర్తించారు. ఇక్కడ కూడా ఒకే ఇంటి నంబరులో హిందూ, ముస్లిం ఓటర్లు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటి చిరునామా ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్నట్లు జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతంలో ఆ నంబర్ ఇళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపారు. ఇలా ఒకే ఇంటి చిరునామాతో 20 అంతకంటే ఎక్కువ కలిగిన ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. 8,248 ఓట్లు బయటపడ్డాయన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్షాల నేతలు మాట్లాడుతూ..''కర్నూలు నగరంలో 122 ఏళ్ల వయసున్న ఓటర్లు ఇద్దరు ఉన్నారు. 121 ఏళ్ల వయసున్న ఓటర్లు నలుగురు ఉన్నారు. వంద కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు 32 మంది ఉన్నారు. 80 కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు 2,633 మంది ఉన్నారు.. తప్పుల తడకగా ఓటర్ల జాబితా తయారు చేశారనడానికి ఇదే నిదర్శనం. ఇంటి చిరునామా లేనివి, నామమాత్రపు చిరునామా కలిగిన ఓటర్లు అధికంగా దర్శనమిస్తున్నాయి.'' అని నేతలు ఆరోపించారు.

01 సంఖ్యతో 922 ఓట్లు.. ZF 0284497 ఓటర్ ఐడీలో సునితాబాయి అనే ఓటరు ఇండోర్ స్టేడియం ధరంపేట అనే వీధిలో ఉన్నట్లు ఓటరు జాబితాలో పేర్కొన్నారు. కానీ, ఆ అడ్రస్ కెళ్లి పరిశీలించగా..ఆ ఇంటి నంబర్ నాట్ అప్లికబుల్ అని ఉండడం సంచలనంగా మారింది. ఇలాంటివి దాదాపు 200కు పైబడే ఉన్నాయని విపక్షాలు పేర్కొన్నాయి. మరికొన్నింటికి ఇంటి నంబర్ స్థానంలో 01-కర్నూలు అని ఉందని.. ఇలాంటివి 922 ఓట్లు బయటపడ్డాయన్నారు. ఇలాంటి ఓటర్లను ఎక్కడ వెతుక్కోవాలో..?, చిరునామా ఎలా కనిపెట్టాలో..? అర్థం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను తక్షణం తొలగించి.. ఓటర్ల జాబితాను తప్పుల తడక లేకుండా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానమైన ఓట్లనే జాబితాలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటి నంబరులో 152మంది ఓటర్లు.. మరోవైపు క్షేత్రస్థాయిలో ఇల్లే లేకపోయినా ఆ ఇంట్లో అనేక మంది ఉంటున్నట్లు చూపించి వారికీ.. ఓటు హక్కు కల్పించారు. జనవరిలో విడుదలైన జాబితాలో కర్నూలు నగరం 17వ వార్డులోని 69-03-1655 ఇంటి నంబరులో 152మంది ఓటర్లు ఉన్నట్లు ఉంది. ఆ ఇంటి నంబరు జొహరాపురం ప్రాంతంలో ఉన్నట్లు చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ నంబరుతో ఇల్లే లేదు.. ఆ ఇంటికి కార్పొరేషన్‌లో పన్ను కూడా చెల్లించడం లేదు. అయినా ఆ ఇంట్లో డీఎక్స్‌ఎస్‌-4417846 ఐడీ పేరుతో ఫాతిమా, డీఎక్స్‌ఎస్‌-3039807 ఐడీతో మాలిక్‌ బాషా పేర్లు ఉన్నాయి.

డీఎక్స్‌ఎస్‌-3039732 ఐడీతో ఎల్లప్ప, డీఎక్స్‌ఎస్‌ 3039757 ఐడీతో కృష్ణ పేర్లు ఉన్నాయి. ఒకే ఇంట్లో హిందూ, ముస్లిం ఓటర్లు ఎలా ఉన్నారో..? అధికారులకే తెలియాలి. ఇంటి నంబరు 9-1-179లో 122 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకే ఇంట్లో హిందూ, ముస్లింలు ఉన్నారు. ఈ చిరునామాతో కూడిన ఇల్లు ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్నట్లు జాబితాలో ఉంది. కానీ, ఆ ప్రాంతంలో ఎంత వెతికినా ఆ ఇల్లే కనిపించడం లేదు. ఇలా ఇళ్లు లేకుండానే నగరంలో 1,022 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో ఇంట్లో 20 మంది అంతకంటే ఎక్కువ మంది ఉంటున్నట్లు ఒటర్ల జాబితాలో కనిపిస్తుంది. ఇలా 8 వేల 248 ఓట్లు ఉన్నాయి. ZF 0284497 ఐడీ పేరుతో సునీతాబాయి ఇండోర్‌ స్టేడియం ధరంపేట వీధిలో ఉన్నట్లు జాబితాలో ఉంది. కానీ, ఆ ఇంటి నంబరు నాట్‌ అప్లికబుల్‌ అని ఉంది.-విపక్షాల నేతలు, కర్నూలు నగరం

Last Updated :Jul 31, 2023, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.