ETV Bharat / state

గీతను నమ్మి జూనియర్​ ఎన్టీఆర్​ మోసపోయారా? - Jnr NTR Land Issue - Hero NTR Petition in ts High Court

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 11:08 AM IST

Updated : May 17, 2024, 11:13 AM IST

Hero NTR Petition in Telangana high Court : జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటి స్థలం వివాదంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2007లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో స్థలం తీసుకుని చేపట్టిన ఇంటి నిర్మాణంపై బ్యాంకులకు హక్కులు ఉంటాయంటూ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Hero NTR Petition in Telangana High Court : హైదరాబాద్​ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి, నిర్మాణం చేపట్టిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉంటాయని రుణ వసూళ్ల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలంటూ ఎన్టీఆర్ తరఫున జీపీఏ (జనరల్ పవర్ అటార్నీ) హోల్డర్ కె.రాజేశ్వర రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుజయాపాల్, జస్టిస్ జె.శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Hero NTR House Land Issue : పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలాన్ని సుంకు గీత అనే మహిళ నుంచి 2007లో పిటిషనర్ కొనుగోలు చేసినట్లు తెలిపారు. అన్ని అనుమతులు పొంది ఇంటి నిర్మాణం చేపట్టినట్లు కోర్టుకు వివరించారు. 1996లోనే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టి స్థలం యజమాని రుణం పొందారని, అందువల్ల వాటిపై హక్కులు తమవేనంటూ ఎస్బీఐ, ఓబీసీ ఇండస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సర్ఫేసీ చట్టం కింద నోటీసులు జారీ చేశాయన్నారు.

పవర్​ఫుల్​ టైటిల్​తో 'NTR 31' - బర్త్​డే రోజు రివీల్! - JR NTR PRASANTH NEEL MOVIE

ఈ నోటీసులను సవాల్​ చేస్తూ పిటిషనర్ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్)ను ఆశ్రయించినట్లు తెలిపారు. అయితే పూర్తి వివరాలను పరిశీలించకుండా డీఆర్టీ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. స్థలాన్ని విక్రయించిన వారిపై కేసు పెట్టినట్లు చెప్పారు. అయితే డీఆర్టీ డాకెట్ ఉత్తర్వులు అందుబాటులో లేవని, గడువు ఇస్తే వారానికి దాఖలు చేస్తామని కోర్టును కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. జూన్ 3లోగా డీఆర్టీ డాకెట్ ఉత్తర్వులను సమర్పించాలని పిటిషన్​ను ఆదేశించింది.

'దేవర ముంగిట నువ్వెంత?, పక్కా హుకుమ్​ పాటను మర్చిపోతారు'- NTR నెక్ట్స్ లెవల్ మాస్! - Devara first single

ఎన్​టీఆర్​ - నీల్ కాంబో ఫిక్స్ - సినిమా షూటింగ్ అప్పుడే! - NTR 31 Movie

Last Updated :May 17, 2024, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.