ETV Bharat / state

తీవ్ర ఘర్షణకు దారితీసిన పందుల తరలింపు..

author img

By

Published : Nov 5, 2022, 10:31 PM IST

Updated : Nov 7, 2022, 12:06 PM IST

పందుల తరలింపు
Movement of Pigs

Pig fight: రాజమహేంద్రవరంలో పందులు పట్టే కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలో పెంచుతున్న పందుల్ని పట్టుకెళ్లేందుకు నగరపాలకసంస్థ అధికారులు ప్రయత్నించగా.. స్థానికులు అధికార సిబ్బంది మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.దీంతో ఈ పందుల తరలింపు ఉద్రిక్తంగా మారింది.

Pig fight: రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో పందుల తరలింపు ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా పెంచుతున్న పందుల్ని పట్టుకెళ్లేందుకు నగరపాలకసంస్థ అధికారులు తమిళనాడు నుంచి సిబ్బందిని రప్పించారు. అధికార సిబ్బంది పందుల్ని పట్టుకుంటుండగా స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో ఇరు పక్షాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఎరుకల సంఘాలు క్వారీ సెంటర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు స్థలం కేటాయించకుండా పెంచుకున్న పందుల్ని తమిళనాడు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగుంటూరు వద్ద పందుల పెంపకం కోసం స్థలం కేటాయించామని, అక్కడ పెంచకుండా. ఇళ్ల మధ్య పెంచడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. అందుకే వాటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తీవ్ర ఘర్షణకు దారితీసిన పందుల తరలింపు

ఇవీ చదవండి:

Last Updated :Nov 7, 2022, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.