నూనె వేడి చేస్తుండగా ఎగిసిన మంటలు - ఏడేళ్ల చిన్నారి మృతి 'భారీగా ఆస్థులు దగ్ధం'
Published: Nov 20, 2023, 12:23 PM


నూనె వేడి చేస్తుండగా ఎగిసిన మంటలు - ఏడేళ్ల చిన్నారి మృతి 'భారీగా ఆస్థులు దగ్ధం'
Published: Nov 20, 2023, 12:23 PM

Several Massive Fire Accidents in Andhra Pradesh: రాష్ట్రంలో పలుచోట్ల ఒకేరోజు అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం సంచలనం రేపింది. అర్ధరాత్రి సమయంలో విశాఖలోని ఫిషింగ్ హార్భర్ ఘటన నుంచి మొదలుకుని ఏదో ఘటన జరుగుతూనే ఉంది. ఈ ఘటనల్లో ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా భారీగా ఆస్థులు దగ్దమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు బ్యాంకుల్లో చెలరేగిన మంటలు ఖాతాదారులను ఆందోళనకు గురి చేశాయి.
Several Massive Fire Accidents in Andhra Pradesh: రాష్ట్రంలో పలు జిల్లాలో అగ్నిప్రమాదాలు చెలరేగాయి. ఈ ప్రమాదాల్లో ఓ చిన్నారితో పాటు లక్షల రూపాయల విలువ చేసే ఆస్థులు దగ్ధమయ్యాయి. కళ్ల ముందే వారి జీవనోపాధి మార్గాలు, కష్టాసుఖాలకు తోడుగా ఉంటుందని కూడబెట్టుకున్న ఆస్థులు కాలిపోతున్నా.. మంటల ధాటికి నిస్సహాయ స్థితిలో బాధితులు మిన్నకుండిపోయారు. చేసేదేమిలేక విలపించడం, ఆవేదన చెందడం తప్ప వారి చేతిలో ఏమీ లేకుండా పోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటాలార్పినా.. జరగకూడదని భావించిందే జరిగిపోయింది. మంటలు చల్లారిన తర్వాత చూస్తే హృదయ విదారకంగా మంటల్లో చిక్కుకుని కాలిపోయిన వస్తువుల భస్మం తప్ప మరేమీ లేదు.
మంటల్లో చిక్కుకుని చిన్నారి బలి: అప్పటి వరకు కుటుంబసభ్యులతో మమేకమైనా చిన్నారి.. మంటల్లో చిక్కుకుని విగతా జీవిగా మారిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చింతలపల్లి మండలం అన్నవరంలో రాజేశ్ అనే వ్యక్తి చిల్లర దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రాజేశ్ తినుబండారాలను.. తయారు చేసేందుకు నూనెను వేడి చేస్తున్నాడు.
Child Died in Fire Accident : నూనె మరిగిస్తున్న సమయంలో మంటలు ఒక్కసారిగా ఇల్లంతా వ్యాప్తి చెందగా.. మంటల్లో చిక్కుకుని ఏడేళ్ల చిన్నారి నిత్య ప్రాణాలు కోల్పోయింది. అగ్నికి ఆహుతైన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు గుండెలావిసేలా రోదించారు. మంటల ధాటికి ఇల్లంతా కాలి బూడిదైపోయింది. సుమారు 3లక్షల వరకు ఆస్థి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆటోమొబైల్ షాపులో ప్రమాదం: కృష్ణా జిల్లాలోని ఓ ఆటో మొబైల్ షాపులో అగ్నిప్రమాదం చేలరేగింది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని ఆటోమొబైల్ షాపు దగ్దమైంది. బాధితుని వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గన్నవరంలోని సినిమా థియేటర్స్ సెంటర్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లో.. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోమొబైల్ షాపులో మంటలు చెలరేగాయి. గన్నవరం బీట్ పోలీసులకు సమాచారం తెలియడంతో.. అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు.
Fire Accident in Auto Mobile Shop in Gannavaram: ఈ ప్రమాదంలో ఆటోమొబైల్ షాపులోని స్పేర్ పార్ట్స్ పూర్తిగా దగ్ధమైపోయాయి. ప్రమాదం అర్థరాత్రి చోటు చేసుకోవడంతో.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
బ్యాంకులో మంటలు: అనంతపురంలోని ఐడీబీఐ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం (Fire Accident in IDBI Bank) చోటు చేసుకుంది. అర్దరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేకపోవడంతో.. బ్యాంకులో ఫర్నిచర్, కంప్యూటర్లు, పలు దస్త్రాలు మంటల్లో కాలిపోయాయి.
సోమవారం ఉదయం బ్యాంకులోంచి పొగలు రావడాన్ని.. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బ్యాంకులోని లాకర్ల వరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం జరగలేదు. ఖాతాదారులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని.. అసిస్టెంట్ మేనేజర్ విజయ్ తెలిపారు.
పాయకరావుపేట ఎస్బీఐలో మంటలు: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించగా.. బ్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బ్యాంకులో ఉన్న ఖాతాదారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
