ETV Bharat / sports

ATP Rankings: 21 ఏళ్లు వెనక్కి ఫెదరర్​- నెం.1గా 358 వారంలో జకో

author img

By

Published : Jan 31, 2022, 6:19 PM IST

ATP Rankings: ఏటీపీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 21 ఏళ్ల కనిష్ఠ ర్యాంకుకు పడిపోయాడు స్విస్​ దిగ్గజ టెన్నిస్​ ఆటగాడు రోజర్ ఫెదరర్​. మరోవైపు అగ్రస్థానంలో కొనసాగుతున్న సెర్బియా స్టార్​ నొవాక్ జకొవిచ్​.. నెం.1గా 358వ వారంలోకి ప్రవేశించాడు.

ATP Rankings
ATP Rankings

ATP Rankings: స్విట్జర్లాండ్ టెన్నిస్​ దిగ్గజ ఆటగాడు, 20 సార్లు గ్రాండ్​స్లామ్​ విజేత రోజర్​ ఫెదరర్​.. ఏటీపీ ర్యాంకింగ్స్​ పురుషుల సింగిల్స్‌లో 21ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాడు. 2001 జనవరిలో 19 ఏళ్ల వయసులో అతడు అందుకున్న ర్యాంక్​కు చేరుకున్నాడు. అప్పటికి అతడు మొదటి టూర్​ టైటిల్​​ కూడా గెలవకపోవడం గమానార్హం.

ఏటీపీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్​లో 40 ఏళ్ల ఫెదరర్​ 13 స్థానాలు దిగజారి.. 1,665 పాయింట్లతో 30వ స్థానానికి పరిమితమయ్యాడు. మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్​ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా ఈ ఏడాది జరగనున్న వింబుల్డన్​కూ ఫెదరర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడిగా​ కొనసాగుతున్న నొవాక్​ జకోవిచ్.. 358వ వారంలోకి ప్రవేశించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Australian Open: నాదల్​కు ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.