ETV Bharat / sports

టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు.. ఆరుగురు డకౌట్.. రెండు బంతుల్లో మ్యాచ్​ పూర్తి​!

author img

By

Published : Feb 27, 2023, 1:02 PM IST

అంతర్జాతీయ టీ20 మ్యాచ్​ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. రెండు బంతుల్లో మ్యాచ్​ ముగిసింది. ఆరుగురు ప్లేయర్లు డకౌట్​ కాగా.. మిగతా వాళ్లు సింగిల్​ స్కోరుకే పెవిలియన్​ చేరారు. ఈ మ్యాచ్​ ఎక్కడ జరిగిందంటే..

worst record isle of man vs spain
worst record isle of man vs spain

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. రెండు బంతుల్లోనే మ్యాచ్​ అయిపోయింది. ఓ జట్టు 10 పరుగులకే​ అలౌట్​ అయ్యింది. అందులో ఆరుగురు డకౌట్​ కాగా.. మిగతా వాళ్లు సింగిల్​ డిజిట్​ స్కోరుకే పెవిలియన్​ చేరారు.
ఐజిల్​ ఆఫ్​ మ్యాన్​ జట్టు స్పెయిన్ పర్యటనకు వచ్చింది. ఆరు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా ఐదు మ్యాచ్​లు స్పెయిన్​ గెలిచింది. ఇరు జట్ల మధ్య ఆరో మ్యాచ్​ ​ ఫిబ్రవరి 26న జరిగింది. టాస్​ ఓడిపోయి బ్యాటింగ్​కు దిగిన ఐజిల్ ఆఫ్​​ మ్యాన్​ జట్టు.. 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులకే ఆలౌట్​ అయింది. జార్జ్​ బుర్రోస్, ల్యూక్​ వార్డ్, జాకబ్​ బట్లర్ (2) పరుగుల చొప్పున చేశారు. జోసెఫ్​ బుర్రోస్(4) పరుగులు చేశాడు. మిగతా వారంతా డకౌట్​ అయ్యారు. ఇక స్పెయిన్ బౌలర్లు మహ్మద్​ కర్రాన్​, ఆటిఫ్ మహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. లార్న్​ బర్న్స్​ 2 వికెట్లు తీశాడు.

ఐజిల్​ ఆఫ్​ మ్యాన్​ జట్టు నిర్దేశించిన 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్​ జట్టు.. రెండే రెండు బంతుల్లో మ్యాచ్​ను ముగించింది. ఐజిల్​ ఆఫ్​ మ్యాన్​ జట్టు తొలి బంతినే నో బాల్​గా వేసింది. ఆ తర్వాత వేసిన రెండు బంతులను బ్యాటర్​ అవైస్ అహ్మద్​ రెండు సిక్స్​లు బాదాడు దీంతో 10 వికెట్లు తేడాతో స్పెయిన్ ఘన విజయం సాధించింది. కాగా, మెన్స్ ఇంటర్నేషనల్​ టీ20 మ్యాచ్​ల్లో 10 పరుగులకే ఆలౌట్​ కావడం.. అది కూడా 10 వికెట్ల(118 బంతులు మిగిలి ఉండగానే) తేడాతో, ఛేసింగ్​లో అత్యధిక రన్​రేట్​(39) లాంటి రికార్డులు ఈ మ్యాచ్​లో నమోదయ్యాయి. దీంతో ఈ 6 మ్యాచ్​ల సిరీస్​ను స్పెయిన్​ 6-0 తేడాతో క్లీన్​ స్వీప్​ చేసింది. నాలుగు వికెట్లు పడగొట్టిన ఆటిఫ్​ అహ్మద్​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.