ETV Bharat / sports

Rohit Sharma Practice : గ్రౌండ్‌లో చెమటోడ్చిన హిట్ మ్యాన్​.. ఆ టోర్నీ కోసమేనా?

author img

By

Published : Aug 19, 2023, 7:59 PM IST

Rohit Sharma Practice Photo : మరికొద్ది రోజుల్లో ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో హిట్​మ్యాన్ రోహిత్ శర్మ మైదానంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. టీషర్ట్, షార్ట్ వేసుకుని గ్రౌండ్​లో కసరత్తులు చేశాడు.

Rohit Sharma Practice Photo
Rohit Sharma Practice Photo

Rohit Sharma Practice Photo : టీమ్​ఇండియా కెప్టెన్​​ రోహిత్‌ శర్మ మైదానంలో చెమటోడ్చాడు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్‌.. ఆసియా వన్డే కప్‌ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. కాగా వెస్టిండీస్‌ పర్యటనలో చివరిగా రోహిత్‌ వన్డే మ్యాచ్‌ ఆడాడు. విండీస్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లో సెంచరీతో చెలరేగిన హిట్​మ్యాన్​ భారత్​కు 1-0తో ట్రోఫీని అందించాడు.

Rohit Sharma Practice Photo
గ్రౌండ్​లో హిట్​మ్యాన్ రోహిత్

కెప్టెన్సీతో అదరగొట్టిన రోహిత్​..
Rohit Sharma West Indies Tour : ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు రోహిత్​. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌ తర్వాత రోహిత్‌తో పాటు టీమ్​ఇండియా స్టార్ ప్లేయర్​ విరాట్‌ కోహ్లీకి కూడా మేనేజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

హిట్​మ్యాన్​ ఫిక్స్ వైరల్..
విండీస్ టూర్ తర్వాత కెప్టెన్​ రోహిత్‌, కోహ్లీ భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆగస్టు 30 నుంచి పాకిస్తాన్‌, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న ఆసియా కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ కోసం కేటాయించాడు. మైదానంలో కసరత్తులు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్‌, షార్ట్​, జాగింగ్‌ షూ వేసుకుని రోహిత్‌ స్టైలిష్‌గా కనిపించాడు.

India Ireland Tour 2023 Squad : ఇక ఆసియా కప్‌ టోర్నీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆగస్టు 23న రోహిత్​ బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో రిపోర్టు చేయనున్నారని తెలుస్తోంది. వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్​ ఇండియా.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో అదరగొట్టింది. ఆగస్టు 18న జరిగిన మొదటి టీ20లో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Asia Cup 2023 : బీసీసీఐ మీటింగ్​కు రోహిత్​.. జట్టులో రాహుల్​, బుమ్రాకు చోటు దక్కేనా?

మిడిలార్డర్​లోకి రోహిత్​? మేనేజ్​మెంట్ ఫిక్స్​ అయినట్టేనా? మరి ఓపెనింగ్ ఆ ఇద్దరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.